Site icon HashtagU Telugu

Karnataka Victims: మత హింసలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

Karnataka Victims

New Web Story Copy 2023 06 17t194409.949

Karnataka Victims: కర్ణాటకలో గత ప్రభుత్వం బీజేపీ హయాంలో మత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగి దాదాపు ఏడాది కావొస్తుంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం జరిగిన మత హింసలో చనిపోయిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు పరిహారం అందజేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

దీపక్ రావు, మహ్మద్ ఫాజిల్, మహ్మద్ మషూద్, అబ్దుల్ జలీల్ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది ఆ రాష్ట్ర గవర్నమెంట్. కర్ణాటక కాంగ్రెస్ శనివారం ట్వీట్ చేస్తూ “అందరికీ సమానం అనే సూత్రంతో నడిపించే మా ప్రభుత్వంలో వివక్షకు ఆస్కారం లేదు. భాజపా హయాంలో మత హింసకు గురైన మసూద్‌, ఫాజిల్‌, జలీల్‌, దీపక్‌రావుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేస్తున్నట్టు సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఇకపై కర్నాటకలో మత కలహాలు, రెచ్చగొట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అన్నారు సీఎం.

అయితే హత్యకు గురైన బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు కుటుంబానికి గత ప్రభుత్వం వివక్షతతో పరిహారం అందించిందని, ముస్లిం కుటుంబాలను పట్టించుకోలేదని మైనారిటీ సెల్ ఆరోపించింది.

Read More: Anasuya Bhradwaj : ఎక్స్ పోజింగ్ లో హద్దులు చెరిపేసిన అనసూయ