Private Autos Ban: ఉబ‌ర్‌.. ఓలా, ర్యాపిడోల‌పై నిషేధం.. ఎక్క‌డంటే..?

మ‌నకి బైక్ రాన‌ప్పుడు మ‌నం మెట్రో న‌గరాల్లో ఎక్క‌డికైనా వెళ్లాలంటే మ‌నకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే..

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 12:25 AM IST

మ‌నకి బైక్ రాన‌ప్పుడు మ‌నం మెట్రో న‌గరాల్లో ఎక్క‌డికైనా వెళ్లాలంటే మ‌నకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే.. యాప్ ఆధారితంగా ప‌నిచేసే ర్యాపిడో, ఉలా.. ఉబ‌ర్ స‌ర్వీసులు. ఎవ‌రైనా ఇంట‌ర్వ్యూకు త్వ‌ర‌గా వెళ్లాల‌నుంటే, లేదా లోకేష‌న్ తెలియ‌కుంటే ఉలా లేదా ర్యాపిడో ఆటో స‌ర్వీసుల‌ను లేదా బైక్ స‌ర్వీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. అయితే ఉబ‌ర్‌, ఓలా.. ర్యాపిడోల‌పై ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఓలా, ఉబ‌ర్‌.. ర్యాపిడో ఆటో స‌ర్వీసుల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుంది. రాబోయే మూడు రోజుల్లో స‌ర్వీసుల‌ను ఆపేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌ను ఆస‌ర‌గా తీసుకొని ఆయా సంస్థ‌ల‌కు భారీగా ఛార్జీలు పెంచాయ‌ని, 2 కిలోమీట‌ర్ల‌కు కూడా రూ. 100 వ‌సూలు చేస్తున్నాయ‌ని ప్ర‌యాణికులు ఫిర్యాదులు చేశారు. ప్ర‌యాణికుల ఫిర్యాదులు ప‌రిశీలించిన క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ సంస్థ‌ల‌కు నోటిసులిచ్చింది.

క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్లు, ర్యాపిడోలు ధరలు పెంచుతూ.. రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ కఠిన చర్యలకు సిద్ధమైంది. అన్యాయపూరితమైన వ్యాపార విధానాలను అనుసరిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లు అన్యాయపూరితమైన వ్యాపార విధానాలను అనుసరిస్తున్నాయని కస్టమర్లు ఫిర్యాదు చేశారు. బుకింగ్స్‌ను అంగీకరించిన తర్వాత బలవంతం మీద కొంత మంది డ్రైవర్లు ట్రిప్‌లు క్యాన్సిల్ చేసేలా చేస్తున్నారని కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ట్రిప్స్ క్యాన్సిల్ చేస్తున్నందుకు కస్టమర్లు ఎక్కువ పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.