Cheap Liquor: క‌ర్ణాట‌క మ‌ద్యం పాల‌సీ ‘‘విచిత్రం’’

క‌ర్ణాట‌క‌ ప్ర‌భుత్వ మ‌ద్యం పాల‌సీ ఆ రాష్టానికి రాబ‌డిని త‌గ్గిస్తోంది. చీప్ లిక్క‌ర్ ను భారీగా ప్ర‌మోట్ చేస్తోన్న క‌ర్నాట‌క బ్రాండెడ్ మ‌ద్యం ధ‌ర‌ను అనూహ్యంగా పెంచింది. ఫ‌లితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌తో పోల్చితే క‌ర్నాట‌క మ‌ద్యం ఆదాయం త‌క్కువ‌గా కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 06:08 PM IST

క‌ర్ణాట‌క‌ ప్ర‌భుత్వ మ‌ద్యం పాల‌సీ ఆ రాష్టానికి రాబ‌డిని త‌గ్గిస్తోంది. చీప్ లిక్క‌ర్ ను భారీగా ప్ర‌మోట్ చేస్తోన్న క‌ర్నాట‌క బ్రాండెడ్ మ‌ద్యం ధ‌ర‌ను అనూహ్యంగా పెంచింది. ఫ‌లితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌తో పోల్చితే క‌ర్నాట‌క మ‌ద్యం ఆదాయం త‌క్కువ‌గా కనిపిస్తోంది. విచిత్రంగా ద‌క్షిణ భారత దేశంలో క‌ర్నాట‌క ప్ర‌జ‌లు అత్య‌ధికంగా మ‌ద్యం తాగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆదాయంలో మాత్రం బాగా వెనుక‌బ‌డింది. క‌ర్నాట‌క ప్ర‌జ‌లకు చీప్ లిక్క‌ర్ ధ‌ర‌ను అక్క‌డి ప్ర‌భుత్వం అనుకూలంగా నిర్ణ‌యించింది. ఫ‌లితంగా ఎక్కువ మంది ప్ర‌జ‌లు చీప్ లిక్క‌ర్ వైపు మ‌ళ్లారు. దీంతో ఆరోగ్య ప‌ర‌మైన సమ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. చీప్ లిక్క‌ర్ ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందించ‌డం, ప్రీమియం బ్రాండ్ల ధ‌ర‌ల‌ను భారీగా పెంచ‌డం కార‌ణంగా క‌ర్నాట‌క రాష్ట్రం ఎక్సైజ్ ప‌న్ను రాబ‌డిని ఎక్కువ‌గా పొంద‌లేక‌పోతోంది.

దేశంలోని కాస్మోపాలిట‌న్ సిటీల్లో బెంగుళూరు ప్ర‌ముఖంగా ఉంది. అక్క‌డికి వెళ్లే విమాన ప్ర‌యాణీకులు హైద్రాబాద్ విమానాశ్ర‌యం నుంచి ప్ర‌ముఖ బ్రాండ్ల మ‌ద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. బెంగుళూరు న‌గ‌రంలో బ్రాండెడ్ మ‌ద్యం ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి కొనుగోలు చేస్తున్నారు. క్యూలో నిలబడి నాణ్యమైన విస్కీ బాటిళ్లను కొనుగోలు చేసి సంతోషంగా వెళుతున్నారు. కాస్మోపాలిటన్ నగరమైన బెంగళూరుతో పోల్చితే IGI విమానాశ్రయం నుండి తాను కొనుగోలు చేసిన విస్కీ బ్రాండ్ ధరల పరంగా చాలా చౌక‌. న్యూఢిల్లీకి తరచూ వెళ్లే వారందరికీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి విస్కీ కొనుక్కోవడాన్ని చూడొచ్చు.

దేశంలోని అతిపెద్ద IMFL మార్కెట్‌లో కర్ణాటక ఒకటి. భారతదేశంలోని అతిపెద్ద కాస్మోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ఉన్న బెంగళూరు, హై-ఎండ్ లిక్కర్ బ్రాండ్‌ల పట్ల విపరీతమైన డిమాండ్ కలిగి ఉంది. అయితే ప్రీమియం బ్రాండ్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించ‌డం వల్ల రాష్ట్ర ఖజానాకు గండి ప‌డుతోంది. విచిత్రమేమిటంటే, దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మ‌ద్యాన్ని క‌ర్నాట‌క‌ విక్రయిస్తోంది, అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయం వెనుకబడి ఉంది. దేశంలోని ఇతర ప్రధాన మార్కెట్‌ల కంటే చీప్ లిక్క‌ర్‌ విక్రయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా తక్కువ ఆదాయం సమకూరుతోంది.