karnataka: ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమే!

దేశంలో అక్కడక్కడ నేటికీ ‘ప్రత్యేక రాష్ట్ర’ ప్రతిపాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 06:08 PM IST

దేశంలో అక్కడక్కడ నేటికీ ‘ప్రత్యేక రాష్ట్ర’ ప్రతిపాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలంగాణ, కశ్మీర్ మాదిరిగా ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడుతూ… ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ కొన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా, మహారాష్ట్రను మూడు రాష్ట్రాలుగా, కర్ణాటకను రెండు రాష్ట్రాలుగా విభజించనున్నారని చెప్పారు. మన దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండబోతున్నాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోందని చెప్పారు. బెంగళూరు సిటీ పని అయిపోయిందని అన్నారు. తన ఇంటి నుంచి విధాన సౌధకు 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని… కానీ, అక్కడకు వెళ్లడానికి గంటన్నరకు పైగా సమయం పడుతుందని చెప్పారు.