కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి ఫోక్ డ్యాన్స్‌తో వార్తల్లో నిలిచారు. మైసూర్‌లోని ఓ ఆలయ ఉత్సవాల్లో భాగంగా 73 ఏళ్ళ సిద్ధ రామయ్య గురువారం రాత్రి హుషారుగా స్టెప్పులేశారు. తన సొంత ఊరు సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద జానపద నృత్యం ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య తన పాదాల లయబద్ధమైన కదలికతో గాలిలో చేతులు కదుపుతూ, ఆలయ దేవత అయిన సిద్ధరామేశ్వరుడిని స్తుతిస్తూ నృత్య బృందానికి నాయకత్వం వహిస్తూ హుషారుగా గంతులేశారు.
ఈ వీడియోను ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య షేర్ చేశారు. దీంతో ఈ దఫా వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక సిద్దరామేశ్వర ఆలయ ఉత్సవం మూడేళ్లకు ఒకసారి జరుగుతుంది, అయితే ఆలయ నిర్మాణం మరియు కోవిడ్ కారణంగా గత రెండేళ్ళు ఇది నిర్వహించబడలేదు. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తన స్నేహితులు మరియు అభిమానులు కోరిక మేరకు సిద్ధా రామయ్య ఒక్కసారిగా చిన్న పిల్లోడిగా మారి డ్యాన్లు లేస్తూ రచ్చ చేశారు.
ఇకపోతే సిద్ధరామయ్య తన నృత్యాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. కర్ణాటకలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా 2010లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో బళ్లారి పాదయాత్రలో భాగంగా, కర్నాటక రాష్ట్రానికి చెందిన వీరగాసెపు అనే మరో జానపద నృత్యాన్ని ప్రదర్శించి అప్పట్లో అన్ని పత్రికల్లో హెడ్‌లైన్ అయ్యారు. దీంతో చలో బళ్లారిలో భాగంగా చేసిన పాదయాత్రే ఆయన్ని కర్నాటక ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టింది. కాగా చిన్నప్పుడు వీర కుణితం జానపద నృత్యం నేర్చుకోమని సిద్ధా రామయ్యని, వాళ్ళ నాన్న సిద్ధరమణ హుండీలోని, జానపద నృత్య బృందంలో వీర మక్కల కుణితలో చేర్చారని, తన తల్లిదండ్రులు చదువు కంటే కళలు నేర్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారని ఓ ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధా రామయ్య చెప్పారు.
ನಮ್ಮೂರಿನ ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ ದೇವರ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ತಂದೆಯವರು ಸಂಗಡಿಗರೊಂದಿಗೆ ವೀರಕುಣಿತದ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಕ್ಷಣಗಳು pic.twitter.com/GjMv5v4oeA
— Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) March 24, 2022