Site icon HashtagU Telugu

Karnataka Elections :189 మంది అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసిన బీజేపీ

Karnataka Bjp

Bjp

మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 189 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్ ఇతర నేతల సమక్షంలో జాబితాను విడుదల చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. జాబితాలో 52 మంది కొత్త ముఖాలు ఉన్నారని, ఓబీసీ కేటగిరీ నుంచి 32 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 30 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి 16 మంది అభ్యర్థులు ఉన్నారని అరుణ్ సింగ్ తెలిపారు. పార్టీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసిన సింగ్, రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపిని విశ్వసిస్తున్నారని తెలిపారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ స్థానం కోల్పోతోందని.. అంతర్గత పోరుతో కుంగిపోయిందన్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.