Karnataka election : ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాహుల్ స‌న్న‌ద్ధం

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల(Karnataka election) ప్ర‌చారానికి రాహుల్ సిద్ధ‌మ‌య్యారు.

  • Written By:
  • Updated On - April 12, 2023 / 10:32 AM IST

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల(Karnataka election) ప్ర‌చారానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi)సిద్ధ‌మ‌య్యారు. అన‌ర్హ‌త వేటుకు కార‌ణ‌మైన వ్యాఖ్య‌లు చేసిన ప్రాంతం కోలార్ నుంచి ర్యాలీ చేయ‌బోతున్నారు. అక్క‌డ నుంచే `స‌త్య‌మేవ జ‌య‌తే` ర్యాలీని ఏప్రిల్ 5న నిర్వ‌హించ‌బోతున్నారు. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కోలార్ వ‌ద్ద జ‌రిగిన ర్యాలీలో లలిత్ మోడీ , నీరవ్ మోడీ గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని ఉద్దేశించి, “దొంగలందరికీ సాధారణ ఇంటిపేరు మోడీ అంటూ వ్యాఖ్యానించారు. వాటిపై సూర‌త్ కోర్టులో అప్ప‌ట్లో పిల్ వేశారు. దాన్ని విచారించిన కోర్టు రెండేళ్లు పాటు జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీ ప‌ద‌వికి అన‌ర్హునిగా లోక్ స‌భ స‌చివాల‌యం ప్ర‌క‌టించింది. ఆ రోజు నుంచి విప‌క్షాల‌న్నీ దేశ వ్యాప్తంగా ఏక‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాహుల్ గాంధీ(Karnataka election) 

=క‌ర్ణాట‌క ఎన్నికల(Karnataka election) యాత్రను కోలార్ నుంచి ప్రారంభించాలని నిర్ణ‌యించారు. మెగా ర్యాలీని ఇక్కడి నుంచే సాగుతుంద‌ని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను వెనుక‌బడిన వ‌ర్గాల‌కు బీజేపీ ఆపాదించింది. గుజరాత్‌కు చెందిన పార్టీ నాయకుడు పూర్ణేష్ మోడీపై కేసు పెట్టారు. ఆ వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పేందుకు గాంధీ (Rahul Gandhi)నిరాకరించారు. ఫ‌లితంగా లోక్‌సభకు అనర్హత వేటు వేయడంతో విపక్షాల నిరసనలు వెల్లువెత్తాయి. 18 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఈ ప‌రిణామాన్ని కాంగ్రెస్ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు అస్త్రంగా మ‌లుచుకుంటోంది.

అన‌ర్హ‌త వేటుకు కార‌ణ‌మైన వ్యాఖ్య‌లు చేసిన ప్రాంతం కోలార్ నుంచి ర్యాలీ

అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల(Karnataka election) తేదీని బుధ‌వారం ఎన్నికల సంఘం ప్రకటించింది. 2018లో హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్‌తో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఆ ఏడాది తర్వాత అధికారానికి దూరమైంది. కొంద‌రు ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కూటమి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చిందని రెండు పార్టీలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల కంటే ముందుగా పొత్తు లేకుండా వెళ్లిన కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వం క‌ర్ణాట‌క‌లో నిల‌వ‌లేక‌పోయింది. ఈసారి ఎన్నిక‌ల‌కు ముందుగా పొత్తు ఉంటుంద‌ని భావించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నుంది.

Also Read : Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే

మళ్లీ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కుమారస్వామి జేడీఎస్‌తో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు, డీకే శివకుమార్ ఎన్‌డిటివితో మాట్లాడుతూ, “హంగ్ అసెంబ్లీ ప్రశ్న లేదు. ఒకే అతిపెద్ద పార్టీ ఉంటుంది`. అంటూ ఆశాభావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. తొలి జాబితాను విడుద‌ల చేసిన కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. అయితే, మాజీ సీఎం సిద్ధి రామ‌య్య నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకోవాల‌ని చూస్తున్నారు. ఆయ‌న కోలార్ నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు .ప్ర‌స్తుతం సిట్టింగ్ కోలార్ ఎమ్మెల్యేగా జేడీఎస్ నాయ‌కుడు కె శ్రీనివాస గౌడ ఉన్నారు. రెండవ నియోజకవర్గంగా కోలార్ నుండి సిద్ధి రామ‌య్య పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, మాజీ ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి మాత్రమే దరఖాస్తు చేశారని శివకుమార్ చెప్పారు. రెండో నియోజకవర్గాన్ని పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంద‌ని శివ‌కుమార్ తేల్చేశారు.

Also Read : Karnataka Election :డీకే, సిద్ధితో క‌ర్ణాట‌క కాంగ్రెస్ తొలి జాబితా!