కాషాయం దుస్తులు ధరించిన ఖాకీలు.. కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు!

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు దిగుతుండటంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 19, 2021 / 03:02 PM IST

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు దిగుతుండటంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. దసరా రోజున ఉడిపి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ డ్యూటీ చేసే పోలీసులంతా కషాయ బట్టలు ధరించారు. కాషాయ చొక్కాలు ధరించి, తెల్లని లుంగీలు కట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే కాషాయ దుస్తులు ధరించిన ఖాకీల ఫొటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి. కర్ణాటక రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ కు దారితీశాయి.

అయితే ఖాకీలు కాషాయ బట్టలు ధరించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆయన వరుస ట్విట్స్ చేయడంతో రాజకీయాకంగా మరింత దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించారు. బాధ్యతయుతంగా ఉండాల్సిన పోలీసులు కషాయ దుస్తులు ధరించడమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కషాయ దుస్తులు ధరించిన పోలీసులకు బీజేపీ ప్రభుత్వం త్రిశూలం కూడా ఇస్తే బాగుండేదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే స్వయంగా పోలీసుస్టేషన్ కు వెళ్లి, నిందితుడ్ని బయటకు తీసుకెళ్లడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉందో స్పష్టమవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం పోలీసులను ఆర్ఆర్ఎస్ లోకి దింపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం బొమ్మై వెంటనే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఇదే విషయమై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ ‘‘పోలీసు బలగాలు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. కానీ రాజకీయంగా కాషాయరంగు దుస్తులు వేసుకుని పైగా, వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ నాయకుల ఆరోపణల పట్ల సీఎం బొమ్మై ఘాటుగా బదులిచారు. కాషాయ దుస్తులు త్యాగానికి ప్రతీక అని, అలాంటి దుస్తులను పోలీసులు ధరిస్తే తప్పేంటి? అని ఎదురుదాడికి దిగారు. ఆర్ఆర్ఎస్ అంటే జాతి నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ అని, అందర్నీ సమానంగా చూడటమే సంస్థ ఉద్దేశమన్నారు. పోలీసులు కాషాయ దుస్తులు ధరిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. బీజేపీ రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యంగా పనిచేస్తుందని బొమ్మై అన్నారు.