Site icon HashtagU Telugu

Karnataka Indira Canteen : మాట నిలుపుకున్న కాంగ్రెస్‌.. ఇందిరా క్యాంటిన్లు వ‌చ్చేశాయ్‌..టిఫిన్‌, భోజ‌నం ధ‌ర‌లు ఎంత అంటే?

Karnataka Congres Government ready to restart Indira Canteens

Karnataka Congres Government ready to restart Indira Canteens

క‌ర్ణాట‌క(Karnataka) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం విధిత‌మే. 135 స్థానాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 20న సీఎంగా సిద్ధ‌రామ‌య్య‌(Siddaramaiah), డిప్యూటీ సీఎంగా డీకే శివ‌కుమార్(DK Shivakumar) లు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వీరితో పాటు మ‌రో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తాజాగా సిద్ధిరామ‌య్య ప్ర‌భుత్వం కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టింది. రెండో ద‌ఫా కేబినెట్ లో ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు అనేక హామీ ఇచ్చింది. వాటిల్లో ఒక‌టి.. ఇందిర క్యాంటిన్లు(Indira Canteen) సిద్ద‌రామ‌య్య సీఎం అయిన త‌రువాత మొద‌టి విలేక‌రుల స‌మావేశంలో నిర్ల‌క్ష్యానికి గురైన ఇందిరా క్యాంటిన్‌ల‌ను నెల‌రోజుల్లో పున‌రుద్ద‌రిస్తామ‌ని చెప్పారు. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌ర్ణాట‌క‌లో ఇందిరా క్యాంటిన్ల‌ను ప్రారంభించారు. క్యాంటిన్‌లో పేద‌లు, అట్ట‌డుగు వ‌ర్గాల‌కు స‌బ్సిడీ ధ‌ర‌ల‌కు ఆహారం అందించారు. అల్పాహారం రూ.5, ప‌గ‌లు, రాత్రి భోజ‌నం రూ. 10 చొప్పున అందించారు. త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వం వీటిని నిలిపివేసింది. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఇందిరా క్యాంటిన్లు పున‌రుద్ద‌రిస్తామ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక‌లో అల్పాహారం, భోజ‌నం, రాత్రి భోజ‌నం కోసం మెనూని సిద్ధం చేశారు. పోష‌కాహారం, రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను అందించ‌డంపై ప్ర‌భుత్వం దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలో ఇందిరా క్యాంటిన్‌లోని మెనూలో ప్ర‌తీరోజూ వంట‌కాల‌ను మార్పుచేస్తారు. ఉప్మా, కేసరి బాత్, బిసిబేలే బాత్, పొంగల్, అల్పాహారం కోసం ఇడ్లీలు వంటివి ఈ మెనూలో ఉన్నాయి. క్యాంటీన్‌ల‌కు సంబంధించిన టెండ‌ర్ల ప్ర‌క్రియ త్వ‌ర‌లో ప్రారంభం కానుండ‌గా.. ప్ర‌స్తుతం 175 ఇందిరా క్యాంటిన్‌ల‌లో 163 ఇప్ప‌టికే ప‌నిచేయడం మొదలుపెట్టాయని సమాచారం.

 

Also Read : Siddaramaiah Cabinet: సిద్ధ‌రామ‌య్య కేబినెట్‌లో ఒక్క‌రే మ‌హిళా మంత్రి.. శాఖ‌ల కేటాయింపుపై కొన‌సాగుతున్న ఉత్కంఠ‌