CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యనే! తేల్చేసిన హైకమాండ్!

కర్ణాటక సీఎం ఎవరు? అనే ప్రశ్న కేవలం కన్నడ నాటలోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Updated On - May 17, 2023 / 02:40 PM IST

కర్ణాటక సీఎం (CM) ఎవరు? అనే ప్రశ్న కేవలం కన్నడ నాటలోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్, సిద్దరామయ్య నువ్వా-నేనా అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు అనేక మంతనాలు జరిపారు. ‘‘నాకు ఇవే చివరి ఎన్నికలు అని, ముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వాలి’’ అని సిద్ధ రామయ్య తేల్చి చెప్పగా, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చానని డీకే శివకుమార్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పదవీపై కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. తాజా సమాచారం ప్రకారం రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగళూరులో సిద్ధరామయ్య పోస్టర్‌పై ఆయన మద్దతుదారులు పాలు పోసి సంబరాలు చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సిద్ధరామయ్య వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపడం, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం, కీలక నేతలు ఆయనతో కలిసి రావడం లాంటి అంశాలన్నీ సిద్ధరామయ్యను కలిసి వచ్చాయి. ఇక DK శివకుమార్ కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పాజెప్పాలని, ఇద్దరు కలిసిపోవాలని సూచించినట్టు తెలుస్తోంది. కాగా  డీకే ఉప ముఖ్యమంత్రి పదవికి నిరాకరించినట్టు తెలుస్తోంది. కేసుల కారణంగా కాంగ్రెస్ పెద్దలు సిద్ధరామయ్య వైైపు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధరామయ్య అనుభవాన్ని వాడుకోవాలని భావిస్తోంది.

సిద్ధరామయ్యకు కలిసి వచ్చిన అంశాలివే

సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు పలు కారణాలు ఉన్నాయి. అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రధాన కారణం. 135 ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 90మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం (Delhi Congress) నిర్వహించిన రహస్య ఓటింగ్ లో స్పష్టమైనట్లు తెలిసింది. అంతేకాక ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్ ఉంది. ఆయన 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతి రహిత పాలన సాగించారన్న పేరుంది. మాస్ లీడర్ గానూ సిద్దరామయ్యకు పేరుంది. అంతేకాక, సిద్ధరామయ్య అయితే రాబోయే కాలంలో పార్టీలో వర్గవిబేధాలు లేకుండా సాఫీగా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది.

డీకేకు కేసుల అడ్డంకి

ఇక సీఎం రేసులో డీకే శివకుమార్ (DK Shiva Kumar) కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో డీకే ను తప్పిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పదవిని అంగీకరించడానికి నిరాకరించిన డీకే ఎమ్మెల్యేగానే ఉంటానని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోనని ఖర్గేకు శివకుమార్ చెప్పారు. మరోవైపు సిద్ధరామయ్య శివకుమార్‌పై క్రిమినల్ కేసులను ఉదహరిస్తూ, శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై దాడి చేయడానికి బిజెపి సిద్ధంగా ఉండే అవకాశాలున్నాయని వాదించడంతో కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపడం గమనార్హం.

Also Read: Brazilian Teacher: విద్యార్థులతో టీచరమ్మా సెక్సీ డాన్సులు.. చక్కర్లు కొడుతున్న వీడియోలు!