KARNATAKA NEW CM : సీఎం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 05:08 PM IST

కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ .. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ (KARNATAKA NEW CM) ఎంపికపై దృష్టిపెట్టింది. ఇందుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఉదయం ముగ్గురు అబ్జర్వర్లను నియమించారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ దీపక్ బవారియా, కాంగ్రెస్ ప్రస్తుత జనరల్ సెక్రటరీ భన్వర్ జితేందర్ సింగ్ లను పరిశీలకులు నియమించి బెంగళూరుకు పంపారు. ” ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు బెంగళూరులో జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి ముగ్గురు అబ్జర్వర్లు హాజరై.. ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు ఉన్నారు ? సీఎం క్యాండిడేట్స్ కు ఎంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది ? అనే వివరాలు సేకరిస్తారు. అవసరమైతే ఓటింగ్ వేసి సీఎం క్యాండిడేట్ ను ఎన్నుకోవాలని అబ్జర్వర్లు సూచించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ఓటింగ్ రిపోర్ట్ ను పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తారు” అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ లోనే.. సీఎం క్యాండిడేట్ ను ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానానికి కట్టబెడుతూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తీర్మానం చేస్తారని వెల్లడించాయి.

ALSO READ : Karnataka: కర్ణాటకలో కొత్త సీఎం ఎవరు..? డీకే శివకుమార్, సిద్ధరామయ్య కాకుండా సీఎం రేసులో మరో ఇద్దరు..!

రెండు, మూడు రోజుల్లోగా సీఎం క్యాండిడేట్ పై ప్రకటన ?

సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో పార్టీ ఉందని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు మీడియాకు తెలిపారు. రెండు, మూడు రోజుల్లోగా సీఎం క్యాండిడేట్ (KARNATAKA NEW CM) పై పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వెలువడుతుందని చెప్పారు . ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగా రెడ్డి మాట్లాడుతూ .. “ఏ పార్టీ గెలిచినా సీఎం పదవి కోసం పోటీ ఉండటం కామన్. డీకే శివకుమార్ , సిద్దరామయ్య ఇద్దరే కాదు .. ఎంబీ పాటిల్ , జీ పరమేశ్వర కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. ఎవరో ఒకరే సీఎం అవుతారు. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు కలిసి సీఎంను ఎన్నుకుంటారు. నాకు మంత్రి పదవి రావచ్చు” అని వ్యాఖ్యానించారు. ఇక ఓ వైపు బెంగళూరులో సీఎల్పీ మీటింగ్ జరుగుతుండగా.. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ కానున్నారు. కర్ణాటక సీఎం ఎంపికపై వారి నిర్ణయాన్ని తెలుసుకునేందుకే ఖర్గే కలుస్తున్నట్లు సమాచారం.