Hijab Row : సుప్రీంకోర్టు తుది తీర్పు కీలకం : కర్నాటక సీఎం..!!

హిజాబ్ నిషేధం కేసులో సుప్రీంకోర్టు గురువారం భిన్నమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై కర్నాకట సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
Basavaraj 1

Basavaraj bommai

హిజాబ్ నిషేధం కేసులో సుప్రీంకోర్టు గురువారం భిన్నమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై కర్నాకట సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. హిజాబ్ వివాదంపై తుది నిర్ణయం రాష్ట్రానికే పరిమితం కాదని…దేశవ్యాప్తంగా వర్తిస్తుందన్నారు. మీడియాతో మాట్లాడిన బసవరాజ్ బొమ్మై…ఇది ఒక కర్నాటకే పరిమితం కాకుండా యావత్ దేశానికి వస్తుందన్నారు. అందుకే తుది తీర్పు కోసం వేచి చూడాల్సిందేనని అన్నారు. హిజాబ్ వివాదం కోర్టుకు తెలుసునని..ఇద్దరు అత్యున్నత ధర్మాసనం న్యాయమూర్తులు తమ తీర్పును వెల్లడించారని ఆయన చెప్పారు.

హిజాబ్ వివాదానికి అనేక కోణాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థుల డిమాండ్ వేరు..ప్రభుత్వ ఉత్తర్వులు వేరని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉన్నందున..సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.

  Last Updated: 14 Oct 2022, 09:05 AM IST