Karnataka: జూలై 1 నుంచి కర్ణాటకలో డిబిటి ద్వారా 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి

కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల ఉచిత బియ్యం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది

Karnataka: కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల ఉచిత బియ్యం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని అందజేస్తుందని, మరో ఐదు కిలోల బియ్యం కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా డబ్బును బదిలీ చేస్తుందని, బిపిఎల్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు రూ. 170 అందజేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తెలిపారు.

బియ్యం అందుబాటులో లేని కారణంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లబ్దిదారులకు డబ్బును అందించనుంది. బియ్యం అందుబాటులోకి రావడానికి 3 నెలల సమయం పట్టవచ్చని, అప్పటివరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్దతిని అమలు చేస్తామని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఓపెన్‌ టెండర్‌కు వెళుతోందని, కనీసం 60 రోజుల సమయం పడుతుందన్నారు. బియ్యం అందుబాటులోకి రాగానే డీబీటీ నగదు నిలిపివేసి బియ్యం అందజేస్తామని తెలిపారు.

తెలంగాణలో వరి మాత్రమే అందుబాటులో ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో 50,000 టన్నుల బియ్యం మాత్రమే ఉన్నాయని, నవంబర్ నుండి బియ్యం ఇస్తామని పంజాబ్ చెబుతోందని, ఛత్తీస్‌గఢ్ తమ వద్ద ఒక నెలకు 1.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని పేర్కొంది. 10 కిలోల ఉచిత బియ్యం అందించాలంటే ప్రతి నెలా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) రవాణా ఖర్చు రూ.2.60తో సహా కిలో రూ.36.60కి అందజేస్తోంది అని సీఎం చెప్పారు.

Read More: Sonu Sood : అరుంధతి మూవీకి సోనూసూద్‌ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? దాని వెనుక పెద్ద కథే ఉంది..!