Site icon HashtagU Telugu

Karnataka 2023 : `విష‌పాము`చుట్టూ క‌ర్ణాట‌కలో మోడీ స‌భలు

karnataka 2023

Bjp Pm Modi

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల (Karnataka 2023) ప్ర‌చారాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఆయ‌న బీద‌ర్ లోని హుమ్నాబాద్ వ‌ద్ద జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఆరు రోజుల పాటు 22 ర్యాలీల్లో పాల్గొన‌డం ద్వారా క‌ర్ణాట‌క ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇటీవ‌ల మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే(Mallikarjuna Khaghe) చేసిన `విష పాము` వ్యాఖ్య‌ను గుర్తు చేస్తూ ఇప్ప‌టికి 91సార్లు నిందించార‌ని మోడీ అన్నారు. త‌న‌ను నిందించిన ప్ర‌తిసారీ కాంగ్రెస్ పార్టీ కూలిపోయింద‌ని గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(Karnataka 2023) 

“కాంగ్రెస్ నన్ను మళ్లీ దుర్భాషలాడడం ప్రారంభించింది. కాంగ్రెస్ నన్ను తిట్టిన ప్రతిసారీ అది కూల్చివేయబడుతుంది. కాంగ్రెస్ నన్ను 91 సార్లు దుర్భాషలాడింది. కాంగ్రెస్ నన్ను తిట్టనివ్వండి, నేను కర్ణాటక(Karnataka 2023) ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను” అని హుమ్నాబాద్ స‌భ‌లో మోదీ(Narendra Modi) అన్నారు. “కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కూడా దుర్భాషలాడింది. వీర్ సావర్కర్‌ను దుర్భాషలాడడం మనం చూస్తున్నాం. సామాన్యుల గురించి మాట్లాడేవారిని, వారి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కాంగ్రెస్ ద్వేషిస్తుంది” అని మోడీ విమ‌ర్శినాస్త్రాల‌ను సంధించారు.

హుమ్నాబాద్ స‌భ‌లో మోదీ(Narendra Modi)

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ(Narendra Modi) తొమ్మిసార్లు క‌ర్ణాట‌క రాష్ట్రంలో(Karnataka 2023) మోడీ ప‌ర్య‌టించారు. ఆ రాష్ట్రంలోని 224 స్థానాల‌కు మే 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అందుకోసం బీజేపీ అగ్ర‌నేత‌లు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ప్ర‌త్యేకించి మోడీ స‌భ‌లు బీజేపీ గ్రాఫ్ ను పెంచాతాయ‌ని ఆ పార్టీ విశ్వ‌సిస్తోంది. అందుకు త‌గిన విధంగా మోడీ వ్యూహాత్మ‌క ప్ర‌సంగాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వేస్తోన్న నింద‌న‌ల‌ను ఓటు ద్వారా తిప్పికొట్టాల‌ని మోడీ పిలుపునిచ్చారు.

కర్ణాటకను నెం.1 రాష్ట్రంగా నిలిపేందుకు అనువుగా బీజేపీకి ఓటు వేయాల‌ని  

కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ‌తంలో చేసిన అవినీతి, అక్ర‌మాల‌ను మోడీ(Narendra Modi) గుర్తు చేశారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఇళ్ల‌ను నిర్మించ‌కుండా కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు. కానీ, బీజేపీ స‌ర్కార్ మ‌హిళ‌ల‌కు ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. కర్ణాటకను నెం.1 రాష్ట్రంగా నిలిపేందుకు అనువుగా బీజేపీకి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. కర్ణాటకలో  మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రోజున వెలువ‌డే ఫ‌లితాలు క‌ర్ణాట‌క రాష్ట్ర భ‌విష్య‌త్ ను నిర్దేశిస్తాయ‌ని అన్నారు.

Also Read : Karnataka 2023 : క‌న్న‌డ నాట విష స‌ర్పం,విష క‌న్య ర‌గ‌డ

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, జెపి నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “కర్ణాటక అభివృద్ధికి సిద్దరామయ్య, మల్లికార్జున్ ఖర్గే మరియు శివకుమార్ (ఎస్ఎంఎస్ ) ప్రమాదకరం. ఈ ఎస్ ఎం ఎస్ కర్ణాటక  భవిష్యత్తును నాశనం చేస్తుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే రక్షించగలదు.` అంటూ వివ‌రించారు. మొత్తం మీద శ‌నివారం మోడీ(Narendra Modi) ప‌ర్య‌ట‌న ఆద్యంత‌మూ విష పాము చుట్టూ తిరిగింది. మిగిలిన స‌భ‌లు ఎలా జ‌రుగుతాయి? అనేది ఆస‌క్తిక‌రంగా ఉంది.

Also Read : Karnataka polls: కన్నడ పాలిటిక్స్… అర్బన్ ఓటర్లు ఈ సారి ఎటువైపు..?

https://twitter.com/BJP4Karnataka/status/1652194416193404929?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1652194416193404929%7Ctwgr%5E8ca986eccf50c75533cc9b95ec3f1b4b2dd78097%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F