Karnataka 2023 : క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు NCP, MIM పోటు

కర్ణాట‌క కాంగ్రెస్ విజ‌యంపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఆ పార్టీకి మిత్రులుగా (Karnataka 2023)

  • Written By:
  • Updated On - April 15, 2023 / 03:15 PM IST

కర్ణాట‌క కాంగ్రెస్ విజ‌యంపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఆ పార్టీకి మిత్రులుగా (Karnataka 2023) ఉండే పార్టీల రూపంలో ప్ర‌మాదం పొంచి ఉంది. ఒక వైపు ఎంఐఎం పోటీకి దిగుతుండ‌గా మ‌రో వైపు ఎన్సీపీ(NCP) కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోంది. ఆ మేర‌కు తాజాగా ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌క‌టించారు. దీంతో క‌ర్ణాకట‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని మ‌రాఠా నియోజ‌క‌వ‌ర్గాలు కాంగ్రెస్ చేయిదాటిపోయే ప్ర‌మాదం నెల‌కొంది.

కర్ణాట‌క కాంగ్రెస్ విజ‌యంపై నీలినీడ‌లు (Karnataka 2023)

యూపీఏలో కీల‌క భాగస్వామిగా ఎన్సీపీ (NCP) ఉంది. దేశ వ్యాప్తంగా విప‌క్షాలు ఒక‌ట‌వుతోన్న వేళ ఎన్సీపీ కాంగ్రెస్ మీద పోటీకి క‌ర్ణాట‌క‌లో సిద్ధం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన స‌మావేశానికి విప‌క్షాలు ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. ప్ర‌త్యేకించి బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా విప‌క్ష వేదిక‌పై క‌నిపించారు. దీంతో మోడీ వ్య‌తిరేక పార్టీలు అన్నీ ఒక‌ట‌వుతున్నాయ‌ని బ‌ల‌మైన సంకేతం వెళ్లింది. పైగా విప‌క్షాల‌ను క‌లిపే బాధ్య‌త‌ను తీసుకుంటాన‌ని నితీష్ ప్ర‌క‌టించారు. ఇదంతా విప‌క్ష కూట‌మికి శుభ‌ప‌రిణామంగా భావిస్తోన్న స‌మ‌యంలో ఎన్సీపీ క‌ర్ణాట‌క వేదిక‌గా స‌రికొత్త పోక‌డ‌ను(Karnataka 2023) ఎంచుకుంది.

ఎన్సీపీ క‌ర్ణాట‌క వేదిక‌గా స‌రికొత్త పోక‌డ‌ 

ఇటీవ‌ల జాతీయ పార్టీ హోదాను ఎన్సీపీ(NCP) కోల్పోయింది. ఆ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. గ‌తంలో మ‌ణిపూర్, మేఘాల‌య‌, గోవాల్లో ఎన్సీపీ ప్రాతినిధ్యం ఉండేది. కానీ, ఆప్ వ‌చ్చిన త‌రువాత ఆ రాష్ట్రాల్లో ఎన్సీపీ గుర్తింపును కోల్పోయింది. దీంతో జాతీయ పార్టీ హోదా కోసం ఎన్సీపీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు. ఆ క్ర‌మంలో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల సరిహ‌ద్దుల్లో మ‌రాఠ మాట్లాడే వాళ్లు ఎక్కువ‌. అక్క‌డ ఎన్సీపీకి బ‌లం ఉంద‌ని ఆ పార్టీ వేస్తోన్న అంచ‌నా. అందుకే, ఎంపిక చేసిన 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయాల‌ని ప్రాథ‌మికంగా(Karnataka 2023) నిర్ణ‌యించుకుంది. ఈ ప‌రిణామం క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు ఎంతో కొంత న‌ష్టం చేకూర్చుతుంద‌ని తెలుస్తోంది.

Also Read : Karnataka Elections : కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు బీఫామ్‌లు అందించిన క‌ర్ణాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్‌

యూపీ, బీహార్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం పోటీ చేసింది. బీహార్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేల‌ను కూడా గెలుచుకుంది. ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు ఆధారంగా ఎంఐఎం దేశ వ్యాప్తంగా పోటీ చేస్తోంది. ఆ క్ర‌మంలో యూపీలో పోటీ చేసిన కార‌ణంగా ఎస్పీ భారీగా న‌ష్ట‌పోయింది. క‌నీసం 60 నుంచి 70 స్థానాల్లో 1000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి మీద ఎస్పీ ఓడిపోయింది. అంటే, ఎంఐఎం కార‌ణంగా బీజేపీ వ‌రుస‌గా రెండోసారి యూపీలో అధికారంలోకి రాగ‌లిగింది. అదే త‌ర‌హాలో గుజ‌రాత్ లోనూ ఆప్ కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ భారీగా న‌ష్ట‌పోయింది. ఇప్పుడు ఎంఐఎం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల(Karnataka 2023) బ‌రిలోకి దిగ‌నుంది. క‌నీసం 25 స్థానాల్లో పోటీ చేయాల‌ని భావిస్తోంది. ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ ప్రాంతాల్లో ఎంఐఎం అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగ‌బోతున్నారు. ఇలా, ఎన్సీపీ(NCP), ఎంఐఎం, ఆప్, గాలి జనార్థ‌న్ రెడ్డి కొత్త పార్టీ ప్ర‌భావం కాంగ్రెస్ మీద ప‌డ‌నుంది.

ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మ‌ధ్య ఉంటుంద‌ని స‌ర్వేల సారాంశం. కానీ, మారిన ప‌రిస్థితుల దృష్ట్యా ప‌లు పార్టీల ప్ర‌భావం కాంగ్రెస్ మీద ప‌డ‌నుందని తెలుస్తోంది. అంటే, కర్ణాట‌క కాంగ్రెస్ కు కేక్ వాక్ కాద‌ని స్ప‌ష్టం అవుతోంది.

Also Read : Karnataka Elections: 38 ఏళ్ళ రికార్డును కాషాయ పార్టీ బద్దలు కొడుతుందా ?