Karnataka 2023 : క‌ర్ణాట‌క పీఠంపై కాంగ్రెస్! BJPకి`బోర్డ‌ర్`పార్టీల‌ పోటు

కర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాల‌న్న‌ట్టు స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం క‌ర్ణాట‌క(Karnataka 2023) బీజేపీ మీద ప‌డింది.

  • Written By:
  • Updated On - May 13, 2023 / 04:13 PM IST

కర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాల‌న్న‌ట్టు స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం క‌ర్ణాట‌క(Karnataka 2023) బీజేపీ మీద ప‌డింది. కోస్ట‌ల్ క‌ర్ణాట‌క మిన‌హా మిగిలిన చోట్ల బీజేపీ(BJP) ఓట‌మికి ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పార్టీలుగా క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా హైద‌రాబాద్ క‌ర్ణాట‌క , ముంబై క‌ర్ణాట‌క ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్ర‌భావం ప‌డింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ క‌లిసి సంయుక్తంగా ఓట‌ర్ల‌ను బీజేపీకి వ్య‌తిరేకంగా ర్యాలీ చేయ‌గ‌లిగింది. తెర వెనుక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేజిన ప్ర‌య‌త్నం బీజేపీని చావు దెబ్బ తీసిందని టాక్‌.

స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం క‌ర్ణాట‌క(Karnataka 2023)

ముంబై కర్ణాట‌క(Karnataka 2023) ప్రాంతాల్లో ఎక్కువ‌గా బీఆర్ ఎస్(BRS) ప్ర‌భావం బీజేపీ(BJP) మీద ప‌డింద‌ని చెప్పుకోవాలి. మ‌హారాష్ట్ర, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో మూడు మీటింగ్ ల‌ను కేసీఆర్ పెట్టారు. అంతేకాదు, బోక‌రో మార్కెట్ యార్డుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో బీజేపీ మీద కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో పెట్టిన మీటింగ్ ల్లో న‌రేంద్ర మోడీ పాల‌న మీద దుమ్మెత్తి పోశారు. అమిత్ షా, మోడీ వ్య‌వ‌హారాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు, చాప‌కింద‌నీరులా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పావులు క‌దిపార‌ని తెలుస్తోంది.

ముంబై కర్ణాట‌క ప్రాంతాల్లో ఎక్కువ‌గా బీఆర్ ఎస్  ప్ర‌భావం

రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండే బంధం కార‌ణంగా కోస్ట‌ల్ క‌ర్ణాట‌క (Karnataka 2023)బాధ్య‌త‌ను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు అప్ప‌గించార‌ని ప్ర‌చారం ఉంది. అందుకు త‌గిన విధంగా ఫండింగ్ నుంచి అన్ని ర‌కాల స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందించార‌ని తెలుస్తోంది. అందుకే, కోస్ట‌ల్ క‌ర్ణాట‌క ప్రాంతంలో బీజేపీ హ‌వా కొన‌సాగింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. అంతేకాదు, గాలి జ‌నార్థ‌న్ రెడ్డితో కొత్త పార్టీ పెట్టించ‌డం కూడా బీజేపీ, వైసీపీ ఎత్తుగ‌డలో భాగమ‌ని ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, పెద్ద‌గా ప్ర‌భావం హైద‌రాబాద్ క‌ర్ణాట‌క ప్రాంతంలో చూప‌లేక‌పోయారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి (BJP) వ్య‌తిరేకంగా సెటిల‌ర్లు ఓట్లు వేశార‌ని తెలుస్తోంది. అందుకే, సెంట్ర‌ల్ క‌ర్ణాట‌క ప్రాంతంలో బీజేపీ చావు దెబ్బ తింద‌ని తెలుస్తోంది. గ్రేటర్ బెంగుళూరులోనూ సెటిల‌ర్లు బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటింగ్ చేయ‌డం కార‌ణంగా అంచ‌నా మేర‌కు రావాల్సిన మెజార్టీ సీట్ల‌ను బీజేపీ కోల్పోయింద‌ని స్థానికుల అభిప్రాయం.

కోస్ట‌ల్ క‌ర్ణాట‌క బాధ్య‌త‌ను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు

ఓల్డ్ మైసూర్ (Karnataka 2023) ప్రాంతంలో జేడీఎస్ బ‌లంగా ఉండేది. ఈసారి అక్క‌డ బీజేపీ(BJP) బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిలిపింది. ఫ‌లితంగా హిందూ ఓట్ల స‌మీక‌ర‌ణ బూమ్ రాంగ్ అయింది. అక్క‌డు ఆ రెండు పార్టీలు హిందూ ఓట‌ర్ల‌ను పంచుకున్నారు. అందుకే, జేడీఎస్ భారీగా న‌ష్ట‌పోయింది. గ‌త ఎన్నిక‌ల కంటే భారీ న‌ష్ట‌పోయిన జేడీఎస్ (JDS) కింగ్ మేక‌ర్ క‌ల ఆవిరైయింది. ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మ‌ళ్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మునుపెన్న‌డూ లేనివిధంగా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో మోజార్టీ వ‌చ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్యేల సంఖ్య అక్కడ పెరిగింది. దీంతో మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటిపోయింది. లేదంటే, హంగ్ దిశ‌గా ఉండేద‌ని స్థానికుల విశ్లేష‌ణ‌గా ఉంది.

Also Read : Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితాలపై మోడీని టార్గెట్ చేసిన శివసేన ఎంపీ ప్రియాంక

మొత్తంగా ఎప్పుడూ హంగ్ దిశ‌గా ఫ‌లితాల‌ను ఇచ్చే క‌ర్ణాట‌క ఓట‌ర్లు(Karnataka 2023) ఈసారి కాంగ్రెస్ కు ప‌ట్టం క‌ట్టారు. సింగిల్ గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స్థానాల‌ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఓట‌మిని అంగీక‌రించిన సీఎం బొమ్మై రాజీనామా చేశారు. ఆదివారం సీఎల్పీ లీడ‌ర్ ను ఎంచుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కాంగ్రెస్ సిద్ద‌మ‌వుతోంది. ఇదంతా ఏఐసీసీ చీఫ్ గా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు ల‌భించిన తొలి విజ‌యంగా చెప్పుకోవ‌చ్చు. క‌ర్ణాట‌క ఎన్నికల ప్ర‌చారంలో రాహుల్, సోనియా, ప్రియాంక స‌భ‌ల ప్ర‌భావం బాగా క‌నిపించింది. పైగా రాహుల్ మీద ఎంపీ అన‌ర్హ‌త వేటు సానుభూతిని తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ త‌యారు చేసిన మేనిఫెస్టో కూడా ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించింది. గ్రామీణ ప్రాంతాల ఓట‌ర్లు ఎక్కువ‌గా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. ఫ‌లితంగా అధికారంలోకి కాంగ్రెస్ రావ‌డం జ‌రిగింది.

Also Read : Karnataka Results: తెలంగాణలో కర్ణాటక రిజల్ట్స్ రిపీట్.. గెలుపుపై రేవంత్ ధీమా