Site icon HashtagU Telugu

Karnataka Politics: విపక్షాల ఐక్యత…కానీ ఒకటి తక్కువైంది !

Karnataka Politics:

Kapil Sibal 1681541953

Karnataka Politics: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఇంకా చాలా చేయాల్సి ఉందని కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంలో విపక్షాల ఐక్యతను చూసి కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. విపక్ష నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కావడమే విపక్షాల ఐక్యతకు సంకేతమా అని సూటిగా ప్రశ్నించారు.

కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఫలితాల్లో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఇక జేడీఎస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కాగా కర్ణాటక సీఎం రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉండగా అధిష్టానం సిద్దరామయ్యకే అధికారం అప్పగించింది. శివకుమార్ డిమాండ్లకు అనుగుణంగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి యజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సీపీఎం హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌హాసన్‌ హాజరయ్యారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఆప్, బీఎస్పీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలను ఆహ్వానించలేదు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నేతలంతా చేయి చేయి పట్టుకుని విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఇది సరిపోదని అభిప్రాయపడ్డారు. మోడీని ఢీకొట్టాలంటే రాజకీయ చతురత అవసరమని, విపక్షాలు ఏకమై ఇంకా చేయాల్సి ఉందని అన్నారు. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంలో విపక్షాల ఐక్యతను చూసి కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. విపక్ష నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కావడమే విపక్షాల ఐక్యతకు సంకేతమా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి మెగా షోల కంటే ప్రతిపక్షాల ఐక్యతకు లోతైన విషయాలు అవసమని సూచించారు. ఉమ్మడి ఎజెండా కావాలని మరియు సొంత ప్రయోజనాలను పక్కనపెట్టాలన్నారు.

Read More: Stadium Stampede : 12 మంది మృతి..స్టేడియంలో తొక్కిసలాట