Site icon HashtagU Telugu

Kamal Haasan : MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు – అన్నామలై

Kamal Annamalai

Kamal Annamalai

తమిళనాడులో ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన పై ఇప్పుడు పెద్ద రాజకీయ తుపాన్ ముమ్మరమైంది. ఈ దుర్ఘటనలో పలువురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటన అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కమల్ హాసన్ ప్రభుత్వాన్ని పొగడటంపై బీజేపీ నేత అన్నామలై (Annamalai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “కమల్ హాసన్ DMKకి అమ్ముడుపోయారు. ఒక MP సీటు కోసం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నారు. తమిళ ప్రజలు ఇక ఆయనను సీరియస్‌గా తీసుకోవడం లేదు” అని విమర్శించారు.

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌.. బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్‌!

ఇక, ఈ ఘటనను రాజకీయంగా మలచడంలో NDA నేతలు కూడా ముందున్నారు. ఇటీవల కరూర్‌ను సందర్శించిన NDA ఎంపీలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు “ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహక యంత్రాంగం వైఫల్యం” కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు. “ప్రజల ప్రాణాలకంటే ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం సిగ్గుపడాలి” అంటూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో కరూర్ ఘటన రాజకీయ రంగం దిశగా మలుపు తిరిగింది.

అయితే బీజేపీ ఆరోపణలకు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “ప్రజల ప్రాణాలను కోల్పోయిన ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇది మానవత్వానికి విరుద్ధం” అని ఆయన అన్నారు. ప్రభుత్వం బాధితులకు తక్షణ సాయం అందించిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Exit mobile version