తమిళనాడు(Tamilanadu)లోని రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం(Modi Govt)తో విభేదాలతో తమిళనాడు సర్కార్ రగిలిపోతోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), త్రిభాషా విధానంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. డీఎంకే సహా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు హిందీ భాషను బలవంతంగా రుద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు తీసుకుంటోందని డీఎంకే, ఇతర పార్టీలు అంటున్నాయి.
Trump Vs Mitr Clinic: ట్రంప్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మిత్ర్ క్లినిక్ బంద్.. ఎందుకు ?
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ (Kamal Hasan) కూడా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. దేశాన్ని హిందీయాగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషను అనివార్యంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశం గురించి ఆలోచించాల్సిన నేతలు, ప్రత్యేకంగా హిందీయా అనే భావనతో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా డీలిమిటేషన్, త్రిభాషా విధానం లాంటి కీలక అంశాలపై తమిళనాడు పార్టీలన్నీ కలిసి సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ప్రధానంగా 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో కమల్ హాసన్ తన “హిందీయా” వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్ర విధానాలను తీవ్రంగా విమర్శించారు.
ఇది మొదటిసారి కాదు, 2019లో హిందీ దినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎంకే స్టాలిన్ “ఇది ఇండియా, హిందీయా కాదు” అని ఘాటుగా స్పందించారు. ఇప్పుడు అదే విషయాన్ని కమల్ హాసన్ మరోసారి ప్రస్తావించారు. తమిళ ప్రజలు తమ భాష కోసం పోరాటం చేస్తారని, భాషను రుద్దే ప్రయత్నాలు మంచివి కాదని హెచ్చరించారు.