Site icon HashtagU Telugu

Kamal Haasan: కేజ్రీవాల్‌కు క‌మ‌ల్ క్రేజీ ట్వీట్

Kamal Haasan Arvind Kejriwal

Kamal Haasan Arvind Kejriwal

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్ము రేపిన సంగ‌తి తెలిసిందే. దేశంంలో జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు గురువారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘ‌నవిజ‌యం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో సినీ న‌టుడు, రాజ‌కీయ‌నాయ‌కుడు క‌మల్ హాస‌న్ స్పందించారు.

పంజాబ్ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు క‌మ‌ల్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రం పంజాబ్‌లోనూ విజయం సాధించడం ప్ర‌శంస‌నీయ‌మ‌ని కమలహాసన్ ట్వీట్ చేశారు. పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ మాదిరిగానే పంజాబ్ లోనూ అవినీతి రహిత పాలన అందిస్తామని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక‌పోతే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ఆ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న క్ర‌మంలో, ఒకవేళ అక్కడ కూడా గెలిస్తే ఆప్ పార్టీకు జాతీయ పార్టీ హోదాను దక్కించుకునే అవకాశం ఉంది.