Kamal Haasan : డీఎంకేతో కమల్ పొత్తు..

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 03:47 PM IST

లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంకేకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కొద్దీ సేపటి క్రితం సీఎం స్టాలిన్ తో కమల్ హాసన్ సమావేశం అయ్యారు.

శనివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​తో కమల్​ హాసన్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్‌ఎం పార్టీ ప్రచారం చేయనుంది. ఈ సమావేశం అనంతరం కమల్ హాసన్ మీడియాతో..తమ పార్టీ కానీ, తాను కానీ ఈ (లోక్‌సభ) ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసారు. అయితే కూటమి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. డీఎంకే కూటమితో చేరడం పదవుల కోసం కాదని, దేశం కోసమని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

పొత్తులో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2025లో ఒక రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అనంతరం ఆ ఒక్క రాజ్యసభ సీటు నుంచి కమల్ హాసన్ పోటీ చేస్తారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో మొదలైంది. ఆయనను డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపుతుందనే కారణంతోనే కమల్ హాసన్ పొత్తు పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Also : Aloevera: అలోవెరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా