Jyoti Malhotra : పాకిస్తాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా వాసి, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జ్యోతి మల్హోత్రా గతంలో కేరళ ప్రభుత్వ పర్యాటక ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రానికి వెళ్లినట్టు వార్తలు వెలుగు చూశాయి. ఈ ప్రచారాన్ని కేరళ టూరిజం శాఖ నిర్వహించిందని, ఆమెకు స్పాన్సర్‌షిప్ కూడా అందిందని కథనాలు చెక్కర్లు కొట్టాయి.
Lords Pitch Report: భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్ట్.. లార్డ్స్ పిచ్ పరిస్థితి ఇదే!
మంత్రి మహమ్మద్ రియాస్ స్పందన
ఈ వివాదంపై తాజాగా కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందించారు. “రాష్ట్ర టూరిజాన్ని ప్రచారం చేసేందుకు నియమించిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్‌లను ఆహ్వానించాం. అందులో జ్యోతి మల్హోత్రా ఒకరు మాత్రమే. ఆమెపై గూఢచర్య ఆరోపణలు రావడానికి చాలా నెలల ముందే ఇది జరిగింది. ఆమె ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నేరుగా సంబంధం లేదు” అని రియాస్ స్పష్టతనిచ్చారు.
ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
కానీ ఈ వివరణతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు వామపక్ష ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. “పర్యాటక ప్రచార కార్యక్రమానికి ముందు ఆమె నేపథ్యం ఎందుకు పూర్తిగా తనిఖీ చేయలేదు?” అంటూ ప్రశ్నించాయి. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా సైతం సోషల్ మీడియాలో స్పందిస్తూ, “జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వ ఆహ్వానంతో వచ్చిన అతిథి. ఆమెను ఆర్టీఐ ద్వారా బయటపడిన వివరాల ప్రకారం, పర్యాటక శాఖ చాలా గౌరవంగా ఆహ్వానించింది. ఈ ఘటనకు బాధ్యతగా పర్యాటక మంత్రి మొహమ్మద్ రియాస్‌ను తొలగించి విచారణ చేయాలి” అని డిమాండ్ చేశారు.
Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక