Gujarat Riots : గుజ‌రాత్ పోలీసుల త‌ప్పుడు కేసుల‌పై ‘JNUTA’ ఫైట్

గుజరాత్ అల్ల‌ర్ల కేసులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి క్లీన్ చిట్ ల‌భించిన‌ప్ప‌టికీ ఆ కేసు బాధితుల‌కు మ‌ద్ధ‌తు ప‌లికిన వాళ్ల‌ను వెంటాడుతోంది.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 05:00 PM IST

గుజరాత్ అల్ల‌ర్ల కేసులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి క్లీన్ చిట్ ల‌భించిన‌ప్ప‌టికీ ఆ కేసు బాధితుల‌కు మ‌ద్ధ‌తు ప‌లికిన వాళ్ల‌ను వెంటాడుతోంది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించినందుకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్ చేసింది. ఆమెను విడుదల చేయాలని హైద‌రాబాద్ లోని జ‌వహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (JNUTA) డిమాండ్ చేసింది.

గుజరాత్ పోలీసుల ప్రేరేపిత చర్యకు వ్యతిరేకంగా ఉద్యమకారుడికి తిరుగులేని మద్దతుగా నిలవడానికి సిద్దం అయింది. క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ డి బి దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి గుజరాత్ ఎటిఎస్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఇంటి నుండి సెతల్వాద్‌ను అదుపులోకి తీసుకుంది. 2002 గుజరాత్ అల్లర్లలో “నేరపూరిత కుట్ర, ఫోర్జరీ , అమాయక ప్రజలను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను కోర్టులో ఉంచడం త‌దిత‌ర అంశాల‌పై కేసు మోపారు. పోలీసు చిత్రహింసల కేసులో ఇప్పటికే జైలులో ఉన్న గుజరాత్ మాజీ డిజిపి ఆర్ బి శ్రీకుమార్ మరియు మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌లను కూడా ATS అరెస్టు చేసింది.

జెఎన్‌యుటిఎ సెతల్వాద్‌కు మద్దతుగా నిలుస్తుందని సంఘం పేర్కొంది. ఆమె “పౌర హక్కుల పరిరక్షణలో దీర్ఘకాలంగా అవిశ్రాంతంగా పని చేయడం” మత హింస బాధితులకు న్యాయం చేసిందని పేర్కొంది. “అన్ని రకాల నిరంకుశ అణచివేతలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయ విలువలను సమర్థించడం మరియు ధృవీకరించడం కోసం వేధింపులకు గురవుతున్న తీస్తా సెతల్వాద్ మరియు ఇతరులందరికీ JNUTA సంఘీభావాన్ని తెలియజేస్తోంది” అని ఉపాధ్యాయ సంఘం ప్రకటనలో పేర్కొంది. గుజరాత్ హింసాకాండలో బాధితుల మద్దతుదారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని, ఈ కేసులో ఇరికించిన తీస్తా సెతల్వాద్ మరియు ఇతరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.