Site icon HashtagU Telugu

Diwali Gift: గొప్ప మనస్సు చాటుకున్న నగల వ్యాపారి…దీపావళి కానుకగా ఉద్యోగులకు కార్లు, బైక్ లు అందించిన యజమాని.!!

Chennai (1)

Chennai (1)

ఓ నగల వ్యాపారి తన గొప్పమనస్సును చాటుకున్నాడు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను ఇచ్చాడు. ఇది తమిళనాడులో జరిగింది. ఓ జ్యువెల్లరీ షాపు యజమాని తన ఉద్యోగులకు కార్లు, బైక్ లను గిప్టుగా ఇచ్చి వారిలో ఆనందాన్ని చూశాడు. తన జ్యూవెల్లరీ షాపులో పనిచేసే పది మంది ఉద్యోగులకు కారు, 20 మంది ఉద్యోగులకు బైక్ లను బహుమతిగా అందించాడు యజమాని జయంతి లాల్. పూర్తి సహకారం అందించిన ఉద్యోగులను ఆయన అభినందించారు. నా కష్టసుఖాల్లో నాతో పాటు ఉంటూ…నా వ్యాపారం ఎదుగడానికి నాకు సాయం చేసిన ఉద్యోగులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంత భారీ గిఫ్టులను అందజేసేందుకు జయంతి లాల్ కోటీ రూపాయలు ఖర్చు చేశారు. దీపావళికి ఇంత పెద్ద బహుమతులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉద్యోగులు అటున్నారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

 

ఈ బహుమతులు ఉద్యోగులను ప్రోత్సహించేందుకు…వారిజీవితాల్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నానని జ్యువెల్లరీ యజమాని అన్నారు. వీరు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు..నా కుటుంబం. అందుకే ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చాను అన్నారు. వారిని నా కుటుంబంలా చూసుకుంటున్నాను. ప్రతి యజమాని తన సిబ్బందికి బహుమతులు ఇస్తూ గౌరవించాలని తెలిపారు. పండగలకు బోనస్ లు , స్వీట్ బాక్సులు ఇచ్చేందుకు ముందుకు యజమానులను చూశాం కానీ…ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే యజమానిని ఇప్పుడే చూస్తున్నామంటూ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.