Site icon HashtagU Telugu

కర్ణాట‌క‌లో పౌర‌స‌త్వ చ‌ట్టం: సీఎం బొమ్మై

Whatsapp Image 2022 11 26 At 3.16.40 Pm

Whatsapp Image 2022 11 26 At 3.16.40 Pm

ఉమ్మ‌డి పౌర‌స‌త్వం కోడ్ ను అమ‌లు చేయ‌డానిక క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సిద్ధం అయింది. సమానత్వం కోసం రాష్ట్రంలో ఏకరూప పౌర కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్ర‌క‌టించారు. శివమొగ్గలో బిజెపి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సిఎం బొమ్మై మాట్లాడుతూ ఆ మేర‌కు వెల్ల‌డించ‌డంతో ఆ రాష్ట్రంలోని విప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి.

యూనిఫాం సివిల్ కోడ్ తో ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని బొమై అభిప్రాయ‌ప‌డ్డారు. సమానత్వాన్ని తీసుకురావ‌డానికి ఈ చ‌ట్టం ఉప‌యోగప‌డుతుంద‌ని అన్నారు. ఆ చ‌ట్టాన్ని అమలు చేయడానికి బలమైన చర్యలను కూడా తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. దేశంలోని అస్సాం మరియు ఉత్తరాఖండ్ వంటి కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు యుసిసిని అమలు చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాయనే విష‌యాన్ని గుర్తు చేశారు.

Exit mobile version