Velupillai Prabhakaran : వేలుపిళ్లై ప్రభాకరన్.. ఎల్టీటీఈ అనే తీవ్రవాద సంస్థను శ్రీలంక కేంద్రంగా నడిపాడు. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ ప్రాంతాన్ని సాధించేందుకు పోరాడాడు. 2009 సంవత్సరం మే నెలలోనే ఇతడి ఛాప్టర్ ముగిసింది. అప్పట్లో శ్రీలంక ఆర్మీ దాడుల్లో వేలుపిళ్లై ప్రభాకరన్ హతమయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా శ్రీలంక సైన్యం అప్పట్లో విడుదల చేసింది. ప్రభాకరన్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన కుమారుడు ఛార్లెస్ కాల్పుల్లో చనిపోయినట్లు శ్రీలంక సైన్యం పేర్కొంది. ప్రభాకరన్ భార్య మతివతని ఎరంబు, కుమార్తె దువరాగా, మరో కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయారని వార్తలు వచ్చాయి.
Also Read :Pawan Kalyan Letter : జనసేన శ్రేణులకు పవన్ లేఖ ఎందుకు రాశారు ? కారణమేంటి ?
ఫారిన్ కంట్రీలో వేలుపిళ్లై ప్రభాకరన్ ?
కట్ చేస్తే.. గత కొన్నేళ్లుగా పదేపదే ఒక ప్రచారం తెరపైకి వస్తోంది. ‘‘వేలుపిళ్లై ప్రభాకరన్(Velupillai Prabhakaran) జీవించే ఉన్నారు.. ఆయన త్వరలోనే జనం ముందుకు వస్తారు’’ అంటూ తమిళనాడులోని పలువురు రాజకీయా నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియాలో కవరేజీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధమైన వ్యాఖ్యలు చేసే విషయంలో మొదటి స్థానంలో తమిళ విమోచనోద్యమ నేత పి.నెడుమారన్ ఉన్నారు. ఈయన ఎల్టీటీఈ సానుభూతిపరుడు. అందుకే తరచుగా ‘‘వేలుపిళ్లై ప్రభాకరన్ వస్తాడు’’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పి.నెడుమారన్‌ను చూసి స్ఫూర్తి పొంది ఇంకొందరు తమిళ నేతలు సైతం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని పలు మీడియా సంస్థలు కూడా ఇదే బాటపట్టాయి. మే నెలలో జనం ముందుకు వేలుపిళ్లై ప్రభాకరన్ వస్తారంటూ పలు మీడియా సంస్థలు వివాదాస్పద కథనాలను వండి వార్చాయి. ప్రభాకరన్‌కు కుడిభుజం లాంటి, ఎల్‌టీటీఈ నిఘా విభాగం అధిపతి పొట్టు అమ్మన్ కూడా జనం ముందుకు వస్తాడని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ‘‘గుట్టుచప్పుడు కాకుండా ప్రభాకరన్‌ను పొట్టు అమ్మన్ విదేశాలకు తీసుకెళ్లాడు. ఏదో ఒక ఫారిన్ కంట్రీలో ప్రభాకరన్ సేఫ్‌గా ఉన్నాడు’’ అని ఆ న్యూస్ స్టోరీలలో పేర్కొన్నారు.
Also Read :Janasena : వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దొద్దు – నాగబాబు స్వీట్ వార్నింగ్
వేలుపిళ్లై ప్రభాకరన్ గురించి..
- శ్రీలంక ఉత్తర తీర పట్టణం వెలెవట్టితురైలో 1957 నవంబర్ 26న ప్రభాకరన్ జన్మించారు.
- శ్రీలంకలో మెజార్టీ వర్గమైన సింహళీయులు.. తమిళులపై చూపుతున్న వివక్షపై ఆగ్రహంతో ఆయన ఉద్యమాల్లో భాగమయ్యారు.
- భారత స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌ల నుంచి ప్రభాకరన్ స్ఫూర్తి పొందారు.
- అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్ జీవితాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని, వారి జీవితాలపై ఎన్నో పుస్తకాలు చదివానని ప్రభాకరన్ తెలిపారు.
- 1973 లేదా 1974లో తమిళ్ న్యూ టైగర్స్‌ను ప్రభాకరన్ స్థాపించారని చెబుతారు.
- మరో సంవత్సరం గడిచాక ప్రభాకరన్ బృందం తమ తీవ్రవాద సంస్థ పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)గా మార్చుకుంది. ఈ సంస్థే తమిళ్ టైగర్స్‌గా ప్రాచుర్యం పొందింది.
- దాదాపు పది వేల మంది సైన్యంతో బలీయమైన శక్తిగా తమిళ్ టైగర్స్ అవతరించింది.
- 1990వ దశకం చివర్లో, 2000 సంవత్సరం ఆరంభంలో శ్రీలంకలో ఎల్‌టీటీఈ ప్రాబల్యం అత్యధికంగా ఉండేది. శ్రీలంకలో మూడో వంతు భూభాగం ఆ సంస్థ నియంత్రణలోనే ఉండేది.