రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) తొలిసారి IPL టైటిల్ గెలిచిన అనంతరం అభిమానులకు ఊహించని విషాదం ఎదురైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy stadium)లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో అభిమానులను కంట్రోల్ చేసే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 56 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానుల ఆనందం కంటతడిగా మారిన ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇది ఎప్పుడూ జరగకూడని ప్రమాదమని, దీనిపై తాను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానని తెలిపారు. దీర్ఘకాలిక పరిష్కారంగా చిన్నస్వామి స్టేడియాన్ని నగరంలోని మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. తొక్కిసలాటకు గల కారణాలపై విచారణ కొనసాగుతుండగా, ప్రభుత్వ చర్యలపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Akhanda 2 : అఖండ 2 టీజర్ వచ్చేసింది..ఇక థియేటర్స్ లలో పూనకాలే
ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హైకోర్టును ఆశ్రయించింది. తమకు సంబంధం లేని ఘటనగా పేర్కొంటూ, స్టేడియంలోకి ప్రవేశం ఉన్నవారికి మాత్రమే సమాచారం ఇచ్చామంటూ RCB స్పష్టీకరణ ఇచ్చింది. అయితే ఈ వేడుకకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రజలను ఆహ్వానించారన్న వాదనను కూడా కోర్టులో ఉంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య జూన్ 10న ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవనున్నారు. ఈ ఘటనపై పార్టీలోనూ తీవ్ర చర్చలు జరగనున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండుల మధ్య, ఈ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.