‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్ (Web Series)తో బాగా పేరు సంపాదించుకున్న బిహార్ (Bihar) ఐపీఎస్ అధికారి అమిత్ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను తాను అరెస్టు చేసిన తీరుపై లోఢా ‘బిహార్ డైరీస్’ అనే పుస్తకాన్ని రాశారు. దాని ఆధారంగా వెబ్ సిరీస్ (Web Series)ను రూపొందించేందుకు ఆయన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో రూ.1కే అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతకంటే ముందే – వెబ్ సిరీస్ (Web Series)కు సంబంధించి ఆయన భార్య ఖాతాలో రూ.49 లక్షలు జమ అయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. లోఢాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.
Also Read: GVL Narasimha Rao: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును తన్నిన ఆవు..!