Site icon HashtagU Telugu

Kohli Tattoos : కోహ్లీ చేతిపై ఉన్న 11 పచ్చబొట్లు.. వాటి వెనుక ఉన్న అసలు రహస్యం?

Intresting Facts Behind Virat Kohli 11 Tattoos

Intresting Facts Behind Virat Kohli 11 Tattoos

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే. క్రికెట్ లో సచిన్ తరువాత బ్యాటింగ్ లో టీమిండియా కింగ్ లా గుర్తింపు తెచ్చుకుని ఎన్నో ఘనతలును అందుకున్నారు విరాట్ కోహ్ల. విరాట్ కోహ్లీ ఎప్పుడు శారీరకంగా,మానసికంగా, ఫిట్ గా కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా మైదానంలో కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటాడు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో లెక్కలేనన్ని రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ తన గ్లామర్ విషయంలో అలాగే తన ఫిట్నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక విరాట్ కోహ్లీ చూసినప్పుడు తన చేతిపై ఉన్న 11 పచ్చబొట్టు మనం చూసే ఉంటాం.

మరి విరాట్ కోహ్లీ చేతిపై ఉన్న ఆ 11 పచ్చబొట్ల గురించి చాలామందికి తెలుసుకోవాలి అనే తపన కూడా ఉంటుంది. మరి ఆ 11 పచ్చబొట్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ చేతి పై ఉన్న తొలి పచ్చబొట్టు అతని తల్లిదండ్రులు అయిన సరోజ్, ప్రేమ్ అని ఎడమ చేతి భుజంపై రాసి ఉంటుంది. విరాట్ కోహ్లీ 18 వ ఏటనే అతని తండ్రి మరణించడంతో అతని తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉన్నందువల్ల ఆ పచ్చ బొట్టు అతని తండ్రికి గుర్తుగా పొడిపించుకున్నాడట. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టినప్పుడు 2008లో శ్రీలంకతో మ్యాచ్ ద్వారా వన్డే లో అరంగ్రేటం చేసిన కోహ్లీ టీమిండియా తరఫున 175 క్యాప్ అందుకున్నాడు.

వన్డే టెస్ట్ అరంగేట్రానికి గుర్తుగా 175 269 లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నోడు. మూడవ పచ్చబొట్టుగా దేవుడి కన్ను ఉంటుంది. ఆ పచ్చబొట్టు యొక్క సారాంశం ఒక మనిషి గా జీవితాన్ని అర్థం చేసుకోవడం తో పాటు నేను ఏం చేయాలి అనేది చూపిస్తూ ఉంటుంది. విశ్వంలో ఓం అనే పదానికి చాలా అర్థం ఉంది అని కోహ్లీ నమ్ముతూ ఉంటాడట. అందువల్ల తన చేతి పై ఓం అనే పదాన్ని టాటూ వేయించుకున్నాడు. విరాట్ కోహ్లీ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఇంగ్లీష్ పదమైన స్కార్పియోను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. కోహ్లీ చేతికి ఉన్న మరొక పచ్చబొట్టు జపనీస్ సమురాయ్. దాని అర్థం ఒక మిలటరీ అధికారి ఒక యుద్ధం తర్వాత మరొక యుద్ధానికి వెళుతూ ఉంటారు. ఆ యుద్దానికి వెళ్లేటప్పుడు 7 ధర్మాలను పాటిస్తారట. ఆ ఏడు ధర్మాలు తన జీవితంలో ఉండే విధంగా చూసుకునే వాడిని అని ఆ పచ్చబొట్టును వేపించుకున్నాడట. కోహ్లీకి శివుడు అంటే చాలా ఇష్టం. అందువల్ల చూడి లోపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇవే కాకుండా విరాట్ కోహ్లీ చేతిపై మొనాస్ట్రీ, ట్రైబల్ ఆర్ట్ పచ్చబొట్లు కూడా ఉంటాయి..

Exit mobile version