Site icon HashtagU Telugu

International Yoga Day : మైసూర్ యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ…!!

International Yoga Day 2024

International Yoga Day 2024

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం కర్నాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మైసూరు ప్యాలెస్ లో ప్రధానితోపాటు 15వందల మందికి పైగా యోగా ప్రదర్శనలో పాల్గొంటున్నారని PMOవెల్లడించింది. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ హ్యుమానిటీగా వెల్లడించింది. గత రెండేండ్లుగా కోవిడ్ కారణంగా యోగా దినోత్సవాన్ని ఆన్ లైన్లో నే నిర్వహించారు. ఈ ఏడాది కోవిడ్ తగ్గిన నేపథ్యంలో ప్రత్యక్షంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా…భారత్ లోని 75 ఐకానిక్ ప్రదేశాల్లో యోగా ప్రదర్శనలు, వేడుకలను కేంద్ర ప్రభుత్వం జరుపుతోంది. 75 ప్రదేశాల్లో నిర్వహించే యోగా ప్రదర్శనలో కేంద్రమంత్రులతోపాటు పలువురు ప్రముఖలు పాల్గొనున్నారు. అయితే మంగళవారం మోదీ పాల్గొననున్న మైసూర్ యోగా ప్రాంతాన్ని ఇప్పటికే భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.