శ్రీరామనవమి (Sriramanavami ) పర్వదినాన్ని పురస్కరించుకొని దేశానికి మరొక గొప్ప అభివృద్ధి సంకేతంగా నిలిచే పంబన్ బ్రిడ్జ్(Pamban Bridge)ను ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెన, రామేశ్వరాన్ని రైల్వే మార్గంలో దేశానికి అనుసంధానించేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైన ముందడుగు కావడం గమనార్హం.
Sri Ramanavami: శ్రీరామనవమి విశిష్టత తెలుసా..?
పాత పంబన్ వంతెనకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ కొత్త వంతెన అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమైంది. ఇది మకానికల్ లిఫ్టింగ్ సిస్టమ్(India’s first vertical lift sea bridge)తో రూపొందించబడింది. దాని ద్వారా అవసరమైతే నావలు వెళ్లగలిగే విధంగా వంతెన పైభాగాన్ని పైకి లేపే సదుపాయం ఉంది. దీని నిర్మాణంతో రామేశ్వరానికి రైలు మార్గం మరింత వేగవంతం అవుతుంది. భక్తుల రాకపోకలు సులభతరం అవ్వడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా ఇది దోహదపడనుంది.
Ration Cards: ఆ రేషన్ కార్డులు రద్దు.. ఈ-కేవైసీపై కొత్త అప్‌డేట్
ఈ వంతెన ప్రారంభోత్సవాన్ని శ్రీరాముని పుట్టినరోజైన శ్రీరామనవమి (Sriramanavami) నాడే జరుపుకోవడం ఒక విశిష్టత. ఎందుకంటే రామేశ్వరం రామాయణంలో ప్రముఖ స్థలంగా పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో దేశ సాంస్కృతిక వైభవాన్ని, ఆధునిక అభివృద్ధిని కలబోసే ఈ వంతెన జాతికి అంకితం చేయడం గర్వకారణంగా మారింది. పంబన్ వంతెన దేశ ఇంజినీరింగ్ ప్రతిభను చూపిస్తూ, రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది.