Dinesh Karthik: టీ ట్వంటీ వరల్డ్ కప్ మనదే అంటున్న డీకే

టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 09:24 AM IST

టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న ఈ వికెట్ కీపర్ ఫినిషర్‌గా ఆ జట్టుకు అదిరిపోయే విజయాలను అందించాడు. మళ్లీ జాతీయ జట్టులో చోటు కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానంపై దృష్టి పెట్టాడు. తాజాగా ఈ టోర్నీ గురించి మాట్లాడుతూ.. పొట్టి ప్రపంచకప్ గెలిచే ఛాన్స్ భారత్‌కే ఎక్కువ ఉందని తెలిపాడు.

ఈ సారి టీ20 ప్రపంచకప్ గెలిచేందుకు మనకు చాలా గట్టి ఛాన్స్ ఉంది. అందరూ నిలకడగా రాణిస్తున్నారన్నాడు. తన ప్రదర్శన గురించి కూడా స్పందించిన దినేష్ కార్తిక్ ఆట వరకు క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా ఉంటానని, మరోసారి ఇండియా జెర్సీ వేసుకుని మైదానంలో అడుగుపెట్టేందుకు తగినంత కృషి చేస్తానని స్పష్టం చేశాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన దినేశ్ కార్తీక్.. వివిధ రోల్స్ పోషించాడు. వికెట్ కీపర్, ఓపెనర్, బలమైన మిడిలార్డర్ బ్యాటర్, క్లినికల్ ఫినిషర్ ఇలా అనేక స్థానాల్లో గుర్తింపుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ 13 మ్యాచ్‌ల్లో 57 సగటుతో 285 పరుగులు చేశాడు.