Site icon HashtagU Telugu

IND vs ENG: 26/11 ముంబై దాడుల టైంలో ఇంగ్లండ్ సహాయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి.. బీసీసీఐ అలా చేయడంపై గవాస్కర్ పొగడ్తలు

Sunil Gavaskar: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచు రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ భారత శిబిరంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో మొదలుకాకుండానే ఆగిపోయింది. అయితే, ఇంగ్లండ్ మీడియా మాత్రం బీసీసీఐని తప్పుబడుతూ పలు కథనాలు వెలువరించింది. అయితే, రద్దైన మ్యాచ్‌ను వచ్చే ఏడాది పర్యటనలో నిర్వహించేందుకు బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలను భారత దిగ్గజం, మాజీ సారథి సునీల్ గవాస్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. 2008లో ఇంగ్లండ్‌ టీం భారత పర్యటనకు వచ్చింది. అయితే ఆ సమయంలోనే భారత్‌లో 26/11 దాడులు జరిగాయని, అప్పుడా జట్టు చేసిన మేలును గుర్తించుకోవాలని కోరాడు.