కర్ణాటక సీఎం పదవి రేసు (Karnataka CM Post) లో తాను లేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (Karnataka CM Post) ఎవరు కావాలనేది పార్టీ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. తన నియోజకవర్గం కల్బుర్గిలో ప్రజలు అడిగారని 80 హనుమాన్ దేవాలయాలను కట్టించానన్నారు. అయినా తమ పార్టీ మతం, రాజకీయాలను వేర్వేరుగా చూస్తుందని.. బీజేపీ మాత్రం ఆ విధంగా నడుచుకోదని కామెంట్ చేశారు. ఆదివారం కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. “గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ప్రధాని మోడీ చెబుతూనే ఉంటారు.. ‘అరే భాయ్’ 70 ఏళ్లలో మేం ఏమీ చేయకుంటే మీరు ఈ దేశానికి ప్రధాని అయ్యేవారు కాదు.. మేమే ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చాం.. మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు” అని ఖర్గే పేర్కొన్నారు.
ALSO READ : Karnataka Election 2023: ఖర్గే హత్య ఆరోపణలపై మణికాంత్ రాథోడ్ రియాక్షన్
కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఆపి .. కర్ణాటక రాష్ట్రానికి మంచి చేయడంపై ఫోకస్ చేయాలని ప్రధానికి సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్ గానీ, బీజేపీ గానీ పోరాడలేదన్నారు. కర్ణాటక నుంచి ఎన్నికైన ఎంపీలు ప్రధానిని కలిసే అవకాశం రాకపోవడంతో రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించలేకపోయారని ఆరోపించారు. “మోడీ వారితో (ఎంపీలు) మాట్లాడరు. ఇది డోర్-దర్శన్ – ‘దూర్ సే దర్శన్’ (దూరం నుంచి చూపు) లాగా ఉంది. అచ్చం టెలివిజన్ చూస్తున్నట్లుగా ఉంది” అని ఖర్గే వ్యాఖ్యానించారు. మణిపూర్ మండుతున్న సమయంలో ప్రధాని మోడీ బెంగళూరుకు వచ్చి రోడ్ షోలు చేయడం సరికాదని విమర్శించారు. కర్ణాటక పోల్స్ లో ఓడిపోతామనే భయంతోనే మోడీ ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సభ చివర్లో “జై బజరంగ్ బలి.. బ్రేక్ కరప్షన్ కీ నాలీ” అని ఖర్గే నినాదాలు చేశారు.