Site icon HashtagU Telugu

Rajamouli: హృతిక్ రోషన్ ను కించపరచడం నా ఉద్దేశ్యం కాదు: రాజమౌళి

Ss Rajamouli Hrithik Roshan 16736921613x2 1

Ss Rajamouli Hrithik Roshan 16736921613x2 1

Rajamouli: తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదిక మీద ఎగిరేలా చేసిన స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచే భారీగా మార్కెట్ ను క్రియేట్ చేయడంతో పాటు అంతర్జాతీయ వేదిక మీద తొలిసారి తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా రాజమౌళి చేశాడు. ఏ ప్రాజెక్ట్ చేసినా సక్సెస్ చేసే సత్తా ఉన్న రాజమౌళి.. తాజాగా అంతర్జాతీయ మీడియాతో గతంలో తాను చేసిన ఓ తప్పు గురించి వివరించాడు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి రాజమౌళి గతంలో చేసిన కామెంట్లపై తాజాగా స్పందించాడు. ఆ విషయం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. “ఇది జరిగి చాలా కాలం అవుతుంది. దాదాపు 15-16 ఏళ్లు గడిచింది. అప్పుడు నేను చేసిన కామెంట్స్‌ ఇప్పుడేందుకు బయటకు వచ్చాయో తెలియదు. అది బిల్లా మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమంలో అన్నాను. ఆ ఈవెంట్‌కు నేను గెస్ట్‌గా వెళ్లాను. ‘ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషన్‌ నథింగ్‌’ అన్నాను. అలా అనడం కరెక్ట్‌ కాదు. నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదు. కానీ హృతిక్‌ రోషన్‌ కించపరచడం నా ఉద్దేశం కాదు. అతను అంటే నాకు చాలా గౌరవిస్తాను” అని వివరణ ఇచ్చాడు.

నిజానికి హృతిక్ రోషన్ గురించి రాజమౌళి కామెంట్ చేసి చాలా సంవత్సరాలు గడిచింది. దాదాపు అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు కూడా. అయినా ఈ విషయాన్ని రాజమౌళి లైట్ తీసుకోకుండా ఏకంగా అంతర్జాతీయ మీడియా ఎదురుగా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఈ విషయంలో అందరూ రాజమౌళి మనస్తత్వాన్ని మెచ్చుకుంటున్నారు. తప్పు చేసినా దానిని ఒప్పు కోవడం, అది కూడా ఓ స్థాయిలో ఉన్నప్పుడు అనేది ఎంతో గొప్ప విషయం అంటూ నెటిజన్లు ఈ అంశం మీద రాజమౌళిని సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’ సినిమా ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ..‘ధూమ్‌ 2 మూవీ చూసి.. ఎందుకు బాలీవుడ్‌యే ఇలాంటి క్వాలిటి మూవీస్‌ తీస్తుందని ఆశ్చర్యపోయాను. ఎందుకు హృతిక్‌ రోషన్‌ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నా. కానీ బిల్లా ట్రైలర్‌, పోస్టర్స్‌, పాటలు చూశాక ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషర్‌ నంథింగ్‌ అనిపించింది. హాలీవుడ్‌ రేంజ్‌లో బిల్లా మూవీ తీసిన డైరెక్టర్‌ మెహర్ రమేశ్‌కు ధన్యవాదాలు’ అని అనడం తెలిసిందే.

Exit mobile version