Constipation Remedies: ఎంత మలబద్ధకమైనా.. ఆముదంతో ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే..!!

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారని మనందరికీ తెలుసు.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 08:45 AM IST

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారని మనందరికీ తెలుసు. మలబద్ధకం పెద్ద సమస్య కానప్పటికీ, సరైన వైద్యం లేదా వైద్యుల సలహాలు తీసుకోకుంటే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

దీనికి గల కారణాలన్నింటిని మనం పరిశీలిస్తే, నేటి యువత తమ చురుకైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా తరచుగా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు, పీచుపదార్థం తీసుకోకపోతే, జీర్ణక్రియ సరిగా లేనప్పుడు మలబద్ధకం కనిపిస్తుంది.

ఈ సమస్య ఇలాగే నిర్లక్ష్యంగా కొనసాగితే రానున్న కాలంలో మరింత నొప్పిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుండి దూరంగా ఉండాలంటే ముందుగా సరైన ఆహారం, మంచి జీవనశైలిని అనుసరించాలి. వీలైనంత వరకు జీర్ణక్రియకు అంతరాయం కలిగించే జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి.

మనకు తెలిసినట్లుగా, ఆముదం ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువ! ఎందుకంటే ఈ నూనెలో ఉండే ఔషధ గుణాలు, దాని వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు. కాబట్టి ప్రజలు తమ రోజువారీ అవసరాల్లో ఈ నూనెను చాలా తక్కువగా ఉపయోగిస్తారని చెప్పవచ్చు.

అయితే అనేక సమస్యలకు పరిష్కారం చూపే ఆముదంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీకు కూడా మలబద్ధకం సమస్య ఉంటే, రెండు చెంచాల ఆముదం నూనెను వేడి చేసి, ఈ నూనెను పొట్ట పైభాగంలో రాసి, అరచేతితో సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా రోజుకు కనీసం రెండు సార్లు చేస్తే రెండు మూడు రోజుల పాటు మల విసర్జన రాకపోయినా సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా తీరుతుంది.

కొద్దిగా నిమ్మరసంతో పాటు ఆముదం
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, దీనిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

అవసరమైన పదార్థాలు:
సగం నిమ్మకాయ రసం
ఒక టీస్పూన్ ఆముదం

తయారీ విధానం
ముందుగా ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి.
ఈ నీటిలో ఒక టీస్పూన్ ఆముదం వేసి బాగా కలిపి వెంటనే ఈ మిక్స్ చేసిన నీటిని తాగాలి. ఈ హోం రెమెడీని వారానికి కనీసం రెండు సార్లు ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీరు మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నట్లయితే లేదా మీకు ఇప్పటికే కొన్ని వ్యాధులు ఉన్నట్లయితే మరియు ఏదైనా సంబంధిత యాంటీబయాటిక్ మందులు తీసుకుంటుంటే ఆముదం తీసుకోవద్దు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా ఆముదం వాడకూడదు.

నోట్: పైన పేర్కొన్న సమాచారాన్ని మా వెబ్ సైట్ ధృవవీకరించడంలో లేదు. మీ ఆరోగ్య సమస్యలకు సలహా కోసం డాక్టర్ ను సంప్రదించండి..