Site icon HashtagU Telugu

Karnataka CET exams: కర్ణాటక “సెట్” కఠిన నిర్ణయం.. హిజాబీ విద్యార్థినులకు నో ఎంట్రీ

Karnataka Hijab Row

Karnataka Hijab Row

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సెట్) పరీక్ష కు హిజాబ్ ధరించే విద్యార్థినులను అనుమతించరు. హిజాబ్ తొలగించే ముస్లిం విద్యార్థినులను మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి పంపుతారు. మంగళ సూత్రం, ముక్కు పుడుకలు, చెవి పోగులు, బంగారు గొలుసు, చేతి గాజులు, ఇతరత్రా బంగారు ఆభరణాలు ధరించిన వారిని కూడా పరీక్ష కేంద్రం లోకి పంపరు. ఈవిషయాన్ని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ శుక్రవారం ప్రకటించింది. ఈసారి 1.7 లక్షల మంది బాలికలు సెట్ పరీక్షకు హాజరు కానున్నారు. గడియారాలు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ డివైజ్ల ను కూడా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు. ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కోరింది.