Site icon HashtagU Telugu

Actor Vishal : కాశీ మేకోవర్ ను సంతోషించిన హీరో…దేవుడు ఆశీర్వదిస్తాడంటూ ప్రధానికి ట్వీట్..!!

Vishal

Vishal

ప్రముఖ హీరో విశాఖ కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కాశీ పునర్వైభవాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీపై విశాల్ ప్రశంసలు కురింపిచారు. కాశీ ఆలయాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది, మతపరమైన నగరాన్ని పునరుజ్జీవింపజేసిందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విశాల్ సెల్యూట్ చేశారు. విశాల్ ట్వీట్ కు ప్రధాని సమాధానం ఇచ్చారు.

విశాల్ ఇలా ట్వీట్ చేస్తూ…
ప్రియమైన మోదీజీ…నేను కాశీని సందర్శించాను. అక్కడ దర్శనం అద్బుతంగా జరిగింది. గంగానది పవిత్ర జలాన్ని తాకింది. ఆలయాల పునరుద్దరించడం ద్వారా మీరు చేసిన పరివర్తనకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు గతంలో కంటే అద్భుతంగా కనిపిస్తోంది కాశీ పుణ్యక్షేత్రం. కాశీ ప్రయాణం ఇప్పుడు అందరికీ సులువుగా మారింది. దీనికి మీకు నమస్కరిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

విశాల్ ట్వీట్ కు మోదీ రీట్వీట్…
ప్రధాని మోదీ విశాల్ చేసిన ట్వీట్ కు స్పందించారు. మీరు కాశీలో అద్భుతమైన అనుభవం పొందినందుకు ఆనందంగా ఉంది అంటూ రీట్వీట్ చేశారు.