Site icon HashtagU Telugu

Vishal Clarity on Political Entry : రాజకీయ ఎంట్రీ ఫై హీరో విశాల్ ఫుల్ క్లారిటీ..

Tamil Actor Vishal

Vishal

స్టార్ హీరో విజయ్ (VIjay) కొత్త పార్టీని ప్రకటించగా మరో నటుడు విశాల్ (Vishal) సైతం కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్దమవుతున్నాడని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్ అంతకుముందు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్‌ తిరస్కరించారు. ఈ క్రమంలోనే తన అభిమాన సంఘాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’ (విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించారు.

బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ, పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి..ప్రజలకు మరింత సేవ చేయాలనీ భావిస్తున్నాడని కథనాలు ప్రచారం అయ్యాయి. ఈ తరుణంలో విశాల్ రాజకీయ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్నటి నుండి మీడియా లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని..తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ప్రస్తుతం లేదని ప్రెస్ రిలీజ్ విడుదల చేసారు. నన్ను నటుడిగా, సామాజిక కార్యకర్తగా గుర్తించిన తమిళ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు చేతనైనంతలో ప్రజలకు సాయం చేయాలనుకున్నాను. అందుకే నా ఫ్యాన్స్‌ క్లబ్‌ ఏదో సాదాసీదాగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేదిలా ఉండాలనుకున్నాను.

ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలన్నదే ఫ్యాన్స్‌ క్లబ్‌ ప్రధాన ఉద్దేశ్యం. నెక్స్ట్‌ స్టెప్‌లో నియోజకవర్గాల వారీగా, జిల్లాలవారీగా ప్రజా సంక్షేమ ఉద్యమాన్ని చేపడతాం. మరోవైపు మా అమ్మ పేరిట నిర్వహిస్తున్న దేవి ఫౌండేషన్‌ ద్వారా ప్రతి ఏడాది నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాం. రైతులకు కూడా సాయం చేస్తున్నాం. షూటింగ్‌కు వెళ్లిన చాలా చోట్ల జనాల కనీస అవసరాలు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.

వీటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నేనెన్నడూ ఆశించలేదు. అయితే సమాజం కోరుకుంటే భవిష్యత్తులో జనాల కోసం ముందుకు రావడానికి వెనకడుగు వేయను’ అని విశాల్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌) మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశాడు. దీనిబట్టి చూస్తే ప్రస్తుతమైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పాడు.

Read Also : Babu Mohan : బిజెపికి రాజీనామా చేసిన బాబూమోహన్‌