న‌యాగ‌ర ఫాల్స్ వ‌ద్ద పునీత్ చిన్న‌నాటి ఫోటో

హీరో పునీత్ రాజ్ కుమార్ త‌న తండ్రి రాజ్ కుమార్ తో ఉన్న ఫోటోను ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. న‌యాగ‌ర వ‌ద్ద త‌న తండ్రి రాజ్ కుమార్ తో తీసుకున్న ఫోటో అది. ఇప్పుడు ఆ ఫోటో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. వారం క్రితం పునీత్ ఆ ఫోటోను షేర్ చేశాడు

  • Written By:
  • Publish Date - October 29, 2021 / 03:25 PM IST

హీరో పునీత్ రాజ్ కుమార్ త‌న తండ్రి రాజ్ కుమార్ తో ఉన్న ఫోటోను ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. న‌యాగ‌ర వ‌ద్ద త‌న తండ్రి రాజ్ కుమార్ తో తీసుకున్న ఫోటో అది. ఇప్పుడు ఆ ఫోటో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. వారం క్రితం పునీత్ ఆ ఫోటోను షేర్ చేశాడు. పునీత్ కు తండ్రి రాజ్ కుమార్ అంటే ఎలాలేని ప్రేమ‌. రాజ్ కుమార్ ను అప్పాజీగా పునీత్ పిలుస్తుంటాడు. అందుకే ఆప్పాజీతో తీసుకున్న ఫోటోను పునీత్ ఇటీవ‌ల షేర్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

క‌న్న‌డ కంఠీర‌వ బిరుదాంకితుడు రాజ్ కుమార్ న‌యాగ‌ర ఫాల్స్ సంద‌ర్శ‌న‌కు వెళ్లినప్పుడు పునీత్ వెంట ఉన్నాడు. ఆ సమ‌యంలో క్లిక్ చేసిన ఫోటో అంది. 1988లో తండ్రితో క‌లిసి న‌యాగ‌ర ఫాల్స్ వ‌ద్ద తీసుకున్న ఫోటో ఇప్పుడు వైర‌ల్ అయింది. ఆ ఫోటో తో పాటు తండ్రితో ఉన్న అనుబంధాన్ని కూడా పునీత్ నెమ‌రువేసుకున్నాడు. జీవితానికి సంబంధించిన అనే అంశాల‌ను రాజ్ కుమార్ చెప్పేవాడ‌ని పునీత్ గుర్తు చేసుకున్నాడు. తండ్రి వార‌సునిగా క‌న్న‌డనాట సినిమా హీరోగా ఎదిగిన పునీత్ ఫిట్ నెస్ గా ప్రాధాన్యం ఇస్తుంటాడు.

 


వ్యాయామం చేస్తుండగా గుండెనొప్పి రావ‌డంతో పునీత్ ఆస్ప‌త్రిలో చేరాడు. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్టు గుర్తించారు. గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్టు నిర్థారించారు.