తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయి. ఇద్దరు మరణించారు. SDRFఅప్రమత్తమైంది. తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో 47ఏళ్ల మహిళ మరణించింది. మరో ఘటనలో విద్యుత్ తీగ తగిలి ఆటో డ్రైవర్ మరణించాడు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తుండగా స్తంభంపై ఉన్న వైరుకు నేరుగా తాకినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో 35 నుంచి 75 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల ఉన్నత స్థాయి సమావేశం అనంతరం స్టాలిన్ తెలిపారు. అలాగే 43 డ్యామ్‌లలో 75 నుంచి 100 శాతం సామర్థ్యానికి చేరుకుందని, మరో 17 డ్యామ్‌లలో 50 నుంచి 75 శాతం వరకు నిల్వ ఉందన్నారు. వర్షాల తీవ్రత పెరగడంతో రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచారు.