Heavy Rainfall: దేశంలో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, గోవా, కేరళ, అస్సాం, మేఘాలయలో రాబోయే 48 గంటలపాటు భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ శాస్త్రవేత్త అమిత్ కుమార్ ప్రకారం.. తుఫాను బెంగాల్ మీదుగా పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళకు చేరుకుంటుంది. ఈ సమయంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్టోబర్ 3 వరకు వివిధ రాష్ట్రాల్లో వర్షాలు
వాతావరణ శాఖ ప్రకారం.. సెప్టెంబర్ 28న తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: Rajamouli Sentiment : రాజమౌళి సెంటిమెంట్ ను ఏ హీరో బ్రేక్ చేయలేరా..?
అక్టోబర్ 3న అంతటా వర్షాలు కురుస్తాయి
సెప్టెంబర్ 29న అస్సాం, మేఘాలయ, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా అక్టోబర్ 1న ఉత్తర భారత వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది కాకుండా అక్టోబర్ 2, 3 తేదీలలో మొత్తం ఈశాన్య ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. గత 24 గంటల్లో బీహార్‌లోని అరారియా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్, గుజరాత్‌లోని సౌరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు కురిశాయి. మరో నాలుగైదు రోజుల్లో గోవా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాలు కురుస్తాయి.
పిల్లలు, వృద్ధుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చల్లని గాలుల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఈ వర్షంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సోయాబీన్, మినుము, తదితర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది కాకుండా పిల్లలు, వృద్ధులు ఉదయం.. సాయంత్రం బయటకు వెళ్లొద్దని సూచించారు. ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తగా ఉండకండి. వృద్ధులు తెల్లవారుజామున నడకకు దూరంగా ఉండాలి. పిల్లలు రాత్రిపూట నిండు చేతుల బట్టలు వేసుకుని నిద్రించాలి.