బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Bengaluru Stampede) సమీపంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై కూడా ఓ కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ వద్ద సామాజిక కార్యకర్త హెచ్‌ఎం వెంకటేశ్ కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం ఐపీఎల్ ద్వారా జూదాన్ని ప్రోత్సహించడం వల్లే భారీగా జనం గుమ్ముగూడడం తో ఈ విషాదకర ఘటనకు దారి తీసింది అని పేర్కొన్నారు.
Monkey : దీన్నే కోతి చేష్టలు అంటారు.. 20 లక్షల విలువైన బ్యాగ్ ఎత్తుకెళ్లి..
“ఐపీఎల్ ఆట కాదు, ఇది క్రికెట్‌ను కలుషితం చేసిన జూదం. విరాట్ కోహ్లీ ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పాల్గొని ప్రజలను ప్రేరేపించాడు. కోహ్లీతో పాటు ఆర్సీబీ సభ్యులను ఈ ఘటనలో నిందితులుగా గుర్తించి, ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి” అని పేర్కొన్నారు. ఈ కంప్లైంట్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), DNA నెట్‌వర్క్‌పై ఇప్పటికే నమోదైన కేసులో పోలీసులు యాడ్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 105, 118, 120 సెక్షన్ల కింద వారిపై నేరపూరిత నిర్లక్ష్యం (Criminal negligence) అభియోగాలు మోపారు. ఈ సంస్థలతో పాటు కోహ్లీ పాత్రను కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఈ వివాదం, ఈ ఘటన నేపథ్యంలో కోహ్లీ గురువారం లండన్‌కు వెళ్లినట్లు, ముంబై విమానాశ్రయంలో గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసు నేపథ్యంలో కోహ్లీ ని అరెస్ట్ చేస్తారా..? అనేది చూడాలి.