తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఎక్స్ రే రిపోర్ట్స్ A4 పేపర్ పై!

ప్రమాదవశాత్తు కాలుకో, చేతికో దెబ్బ తగిలితే.. నిర్ధారణ కోసం ఎక్స్ రే తీస్తుంటారు. ఎక్స్ రే రిపోర్ట్ ఆధారంగానే డాక్టర్ రోగులకు ఏయే మందులు ఇవ్వాలి? ఎలాంటి చికిత్స అందించాలి? అనే దిశగా ట్రీట్ మెంట్ ఇస్తాడు.

  • Written By:
  • Publish Date - October 7, 2021 / 11:21 AM IST

ప్రమాదవశాత్తు కాలుకో, చేతికో దెబ్బ తగిలితే.. నిర్ధారణ కోసం ఎక్స్ రే తీస్తుంటారు. ఎక్స్ రే రిపోర్ట్ ఆధారంగానే డాక్టర్ రోగులకు ఏయే మందులు ఇవ్వాలి? ఎలాంటి చికిత్స అందించాలి? అనే దిశగా ట్రీట్ మెంట్ ఇస్తాడు. ఎక్స్ రే కదా అని కొంతమంది చాలా తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ రోగికి ట్రీట్ మెంట్ ఇచ్చే క్రమంలో ఇవి కూడా కీలకమే. అయితే అధికారులు నిర్లక్ష్యమో, ప్రభుత్వం అలసత్వమో.. తమిళనాడులోని ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్ రే రిపోర్ట్స్ ను ఫిల్మ్ లో కాకుండా ఏ4 కాగితాల్లో చూస్తూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి ప్రాంతంలోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఎక్స్-రే ఫలితాలను ఫిల్మ్‌ కు బదులుగా A4 సైజు షీట్లలో ఇస్తున్నారని స్థానిక రోగులు ఆరోపిస్తున్నారు. కోవిల్‌పట్టి గ్రామంలో అత్యధికంగా పేదలు, కార్మికులు, వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. ఎదైనా జబ్బు చేస్తే వాళ్లంతా ఖరీదైన ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. అందుకే స్థానిక ప్రభుత్వాస్పత్రికే వెళ్తుంటారు. వివిధ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగుల ఎక్స్ రే రిపోర్ట్స్ కాగితం పేపర్లో ఇస్తున్నారు. ఇలా అనేక వారాలుగా ఏ4 పేపర్లోనే ఎక్స్ రే రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఇదేమీ నిర్లక్ష్యం అని వైద్య సిబ్బందిని నిలదీస్తే నిధుల కొరత అని సమాధానమిస్తున్నారు.

మరిముత్తు అనే వ్యక్తి కుడి చేతిలో గాయమైంది. నొప్పి భరించలేక డాక్టర్లను ఆశ్రయిస్తే ఎక్స్ రే తీయించుకోవాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మాత్రం ఏ4 పేపర్లో ఇవ్వడంతో డాక్టర్లకు చూపించడం కష్టంగా మారింది. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది స్థానికులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలువురు స్థానికులు కలెక్టర్ కు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేని రోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.