Site icon HashtagU Telugu

Governor walks out : త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్ వాకౌట్

Governor walks out

Tamil Gover

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి, గ‌వ‌ర్న‌ర్ కు మ‌ధ్య వివాదం (Governor walks out) తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం విష‌యంలో ప్ర‌భుత్వానికి, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. అసెంబ్లీ ప్ర‌సంగ ప‌త్రాల్లోని కొన్ని అంశాల‌ను గ‌వ‌ర్న‌ర్ చ‌ద‌వ‌కుండా స్కిప్ చేశారు. దీంతో సీఎం స్టాలిన్(Stalin) గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని రికార్డ్ ల‌ను తొల‌గించాల‌ని తీర్మానం చేశారు. దీంతో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ ఎన్ ర‌వి వాకౌట్ (Governor walks out) చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

గవర్నర్ ర‌వి వాకౌట్ (Governor walks out)

సోమవారం ఉదయం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ‌మైన తొలి రోజు సాధార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది. ప్ర‌భుత్వం ఆమోదించిన ప్ర‌సంగ ప‌త్రాల‌ను గ‌వ‌ర్న‌ర్ చ‌ద‌వ‌డం ఆన‌వాయితీ. ప్ర‌భుత్వ త‌యారు చేసిన ప్ర‌సంగానికి భిన్నంగా గవర్నర్ ర‌వి కొన్ని భాగాలను దాటవేయడంతో వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. గవర్నర్ ‘ద్రావిడ మోడల్ గవర్నెన్స్’తో సహా కొన్ని పదాలను దాటవేయడంతో, MK స్టాలిన్ ప్రసంగానికి అంతరాయం కలిగించారు. సిద్ధం చేసిన ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్ తప్పించారని విచారం వ్యక్తం చేశారు.

 Also Read : Punjab Governor:పంజాబ్లో ఆప్ సర్కారుకు షాకిచ్చిన గవర్నర్..

ప్ర‌భుత్వ ప‌త్రాల్లోని అంశాల‌ను రికార్డ్ చేయాల‌ని ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని ఆమోదించారు. ఆ తర్వాత RN రవి వెంటనే సభ నుండి వెళ్లిపోయారు. అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం బహుశా ఇదే తొలిసారి. రవి తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, సభ్యులకు నూతన సంవత్సరం మరియు పంటల పండుగ ‘పొంగల్’ శుభాకాంక్షలు తెలుపుతూ, శాసనసభ్యులు ‘తమిళనాడు వాఙ్గవే’ (తమిళనాడుకు జయంతి) మరియు ‘ఎంగల్ నాడు తమిళనాడు’ (మా భూమి తమిళనాడు’ అని నినాదాలు చేశారు. )

గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్  

20 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించడంతో పాటు పలు అంశాలపై త‌మిళ‌నాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ‌వ‌ర్న‌ర్ ర‌వి భారతీయ జనతా పార్టీ (బిజెపి) హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని డిఎంకె మరియు దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. రాష్ట్ర రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారని డిఎంకె ఆరోపించింది. అతను ఇదే మార్గంలో కొనసాగాలని నిర్ణయించుకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Also Read : Governor Tamilisai : గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు…ఎంత వివక్ష చూపినా, నా పని నేను చేసి తీరుతా..!!

దేశ వ్యాప్తంగా బీజేయేత‌ర రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్, సీఎంల మ‌ధ్య పొస‌గ‌డంలేదు. తెలంగాణాలోనూ త‌మిళ సై గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత సీఎంవో ఆఫీస్, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. కేంద్ర వ‌ద్ద కు ఇద్ద‌రి మ‌ధ్యా వివాదం చేరింది. ఫ‌లితంగా గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా బ‌దిలీ చేయించుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాల‌కు భిన్నంగా త‌మిళ‌నాడులో ఏకంగా అసెంబ్లీ స‌మావేశాల నుంచి గ‌వ‌ర్న‌ర్ వాకౌట్ చేయ‌డం రాజ్యాంగ బ‌ద్దంగా ఏర్ప‌డిన ప‌ద‌వుల చ‌రిత్ర‌లో మొద‌టి సంఘ‌ట‌న‌గా చెప్పుకోవ‌చ్చు.

Also Read : Governor Tamilisai : గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు…ఎంత వివక్ష చూపినా, నా పని నేను చేసి తీరుతా..!!