Site icon HashtagU Telugu

Unemployment Benefits : నిరుద్యోగులకు జనవరి 1 నుంచి నెలకు రూ.3వేలు

cash

cash

Unemployment Benefits : ఉద్యోగం లేని యువతకు ఆర్థికసాయం లభించబోతోంది. నిరుద్యోగులకు సాయం చేసేందుకు ‘యువ నిధి’ పథకం డిసెంబర్ 21న ప్రారంభం కానుంది. దాదాపు 5 లక్షల మంది యువత ఈ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాన్ని అందుకోనున్నారు. జనవరి 1 నుంచి ఈ నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. అయితే ఈ స్కీమ్ అమల్లోకి రాబోయేది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో !! అసెంబ్లీ ఎన్నికల టైంలో కన్నడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీల్లో  ‘యువ నిధి యోజన’ నిరుద్యోగ భృతి పథకం కూడా ఒకటి. ఆ హామీ అమలుకు కర్ణాటక సర్కారు ఎట్టకేలకు తేదీని ఖరారు చేసింది. అర్హులైన ఈ పథకం కోసం డిసెంబరు 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా నిరుద్యోగులు దీనికి అర్హులు.

We’re now on WhatsApp. Click to Join.

పాసైన తేదీ నుంచి 180 రోజుల తర్వాతి వరకు ఉద్యోగం చేయనివారే దరఖాస్తు చేయడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి లేదా గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు మాత్రమే ఈ సౌకర్యం(Unemployment Benefits) అందించబడుతుంది. అభ్యర్థులు డిగ్రీ లేదా డిప్లొమాలో పాసైన తేదీ నుంచి 6 నెలల వరకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా లావాదేవీ స్టేట్‌మెంట్ కాపీని తప్పనిసరిగా అప్లికేషన్‌కు జోడించాలి. డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగులకు నెలకు రూ. 1500, గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు నెలకు రూ.3000 అందజేయనున్నారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ https://sevasindhu.karnataka.gov.in ‌లో చూడొచ్చు.

Also Read: Nizamabad: వేడి గిన్నెలో పడిన 1వ తరగతి బాలిక మృతి