Crime News: గ్వాలియర్‌ లో బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలికపై బెంగళూరులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణమైన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్‌కు చెందిన బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి […]

Published By: HashtagU Telugu Desk
Girl Raped In Gwalior

Girl Raped In Gwalior

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలికపై బెంగళూరులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణమైన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్‌కు చెందిన బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి బెంగళూరుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, బెంగళూరులో బాలికను గుర్తించి రక్షించారు. ఆ సమయంలో ఆమెను బందీగా ఉంచిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం, బాలికను గ్వాలియర్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో నెలరోజుల పాటు ఉంచి, తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇంటికి చేరుకున్న తర్వాత, తనపై జరిగిన ఘోరమైన అఘాయిత్యం గురించి బాలిక తన తల్లికి వివరించింది. బెంగళూరులో తనను బందీగా ఉంచడమే కాకుండా, పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పడంతో ఆ తల్లి హతాశురాలైంది. ఈ కిడ్నాప్, అత్యాచారంలో ఇద్దరు మహిళలు కూడా సహకరించారని బాలిక చెప్పడంతో తల్లి మరోసారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఆరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

  Last Updated: 16 May 2026, 11:14 AM IST