Site icon HashtagU Telugu

Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ

సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.

మంగమ్మ ప్రస్తుతం కర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా ప‌ని చేస్తున్నారు. ఆ పదవి అలంకరించిన తొలి ట్రాన్స్‌విమెన్‌గానూ మంజ‌మ్మ జోగ‌తి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే స‌మ‌యంలో మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను త‌న‌దైన స్టైల్లో ఆశీర్వ‌దించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరలవుతోంది.

తమిళనాడుకు చెందిన నర్తకి నటరాజ్. 2019లో పద్మశ్రీ అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచారు. ఇప్పుడు మంగమ్మ ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తనలాంటి వారికి ఇలాంటి గౌరవాలు ఆత్మ స్థైర్యాన్ని నింపడమే కాకుండా, ఆత్మగౌరవంగా నిలబడడడానికి తోడ్పడుతాయని మంగమ్మ తెలిపారు.

Exit mobile version