Site icon HashtagU Telugu

Ganja : హైద‌రాబాద్‌లో న‌లుగురు గంజాయి వ్యాపారుల అరెస్ట్‌

Ganja

Ganja

హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. చిరువ్యాపారులు అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆకాష్ సింగ్ హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ నివాసి. 2018 నుండి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుండి వైజాగ్, ఒడిశా, ఇతర ప్రాంతాల నుండి గంజాయిని సేకరించి, హైదరాబాద్‌లోని అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.నిందుతుడిపై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో 5కేసులు న‌మోదైయ్యాయి. అంతకుముందు 2021 సంవత్సరంలో PD చట్టం కింద కూడా నిందితుడిని అరెస్ట్ చేఊశారు. గంజాయి వ్యాపారంతో ఆకాష్ సింగ్ నగర శివార్లలోని కట్టెదాన్ ప్రాంతంలో నివాస స్థలాన్ని సంపాదించాడు. మత్తుపదార్థాన్ని కాటేదాన్ ఇంట్లో నిల్వ చేశాడు, అక్కడడే ఆకాష్ సింగ్ గంజాయి పొట్లాలను త‌యారు చేశాడు.

ఆకాష్ సింగ్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల 4 సబ్ పెడ్లర్లను కలిగి ఉన్న నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి… చిన్న సాచెట్‌లను సరఫరా చేస్తాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి వాటిని హైదరాబాద్ సిటీలోని అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తాడు. మ‌రో నిందితుడు షేక్ సుభానీ ఖమ్మం వాసి. అతను ఒడిశా రాష్ట్రంలోని పాపులూరులో గంజాయిని పండించే వల్సగడ్డ మహేష్ నుండి గంజాయిని పెద్దమొత్తంలో సేకరించి, హైదరాబాద్‌లో ప్రధాన వ్యాపారి అయిన ఆకాష్ సింగ్‌కు దానిని పెద్దమొత్తంలో రవాణా చేస్తాడు. ఆకాష్ సింగ్ డ్రగ్స్‌ను సబ్ పెడ్లర్లు మహ్మద్ అయూబ్ ఖాన్, రాంజల్ నర్సింహ, నీరజ్ ప్రసాద్ తివారీలకు విక్రయిస్తున్నాడు. పోలీసులు ప‌క్కా స‌మాచారంతో వీరిని ప‌ట్టుకున్నారు. నిందుతుల‌ను నాంపల్లిలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు.