cracker blast: తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని మోహనూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన క్రాకర్ పేలుడు (cracker blast)లో ముగ్గురు మహిళలు సహా నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

  • Written By:
  • Updated On - December 31, 2022 / 10:29 AM IST

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నమక్కల్ జిల్లా మొగనూర్ మెట్టు వీధిలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి ఆ ఇళ్లు కూలిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.

తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని మోహనూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన క్రాకర్ పేలుడు (cracker blast)లో ముగ్గురు మహిళలు సహా నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులను తిల్లైకుమార్ (43), అతని భార్య ప్రియ (38), అతని తల్లి సెల్వి (65), పెరియక్కల్ (73)గా గుర్తించారు. మోహనూర్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ మాట్లాడుతూ.. తిల్లైకుమార్ లైసెన్స్ పొందిన క్రాకర్ వ్యాపారి. మోహనూర్ గ్రామంలో ‘తిల్లై బాణసంచా’ క్రాకర్ షాప్ కలిగి ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో క్రాకర్లు పేలడం మొదలైంది. పెద్ద శబ్దంతో క్రాకర్లు పేలాయి. తిల్లైకుమార్ ఇల్లు, సమీపంలోని ఐదు ఇళ్ళకు మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

మోహనూర్ పోలీసులతో పాటు నామక్కల్ నుంచి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది వచ్చారు. శిథిలాల కింద కూరుకుపోయిన క్షతగాత్రులను రక్షించారు. మేము ఇప్పటివరకు గాయపడిన ఐదుగురిని రక్షించాము. శిథిలాల క్రింద ఇంకా ఎక్కువ మంది గాయపడి ఉండవచ్చు అని కానిస్టేబుల్ చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నమక్కల్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు.